Sonu Sood: నాన్‌ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్.. క్లారిటీ ఇచ్చిన సోనూ సూద్

త‌న‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయిందంటూ వ‌చ్చిన వార్త‌ల‌పై న‌టుడు Sonu Sood (X) వేదిక‌గా క్లారిటీ ఇచ్చారు. ఆ వార్త‌లు పూర్తిగా అబద్ధ‌మ‌ని ఆయ‌న చెప్పారు. సోషల్ మీడియాలో ఈ అంశాన్ని కావాల‌నే కొందరు అతి చేస్తున్నారని సోనూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న‌కు సంబంధం లేని వేరే అంశంలో సాక్ష్యం చెప్పేందుకు కోర్టు త‌న‌ను పిలిచిన‌ట్లు ఆయ‌న క్లారిటీ ఇచ్చారు.

“నాకు ఎటువంటి సంబంధం లేని మూడో పక్షానికి సంబంధించిన కేసులో కోర్టు నాకు సాక్షి(Witness)గా సమన్లు జారీ చేసింది. అందుకు మా లాయర్లు స్పందించారు. ఈ కేసులో దేనికీ నేను బ్రాండ్ అంబాసిడ‌ర్‌(Not a brand ambassador)ను కాదు. మాకు ఏ విధంగానూ సంబంధం లేదు. సెలబ్రిటీలు(Celebrities) ఇలా అన‌వ‌స‌ర విష‌యాల‌కు లక్ష్యాలుగా మారడం విచారకరం. ప‌బ్లిసిటీ(Publicity) కోసం నా పేరును వాడుతున్నారు. ఆ విష‌యంలో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం” అని సోనూ సూద్ ట్వీట్ చేశారు.

కోర్టు సమన్లు పంపినా రాలేదని వార్తలు

కాగా మోసం కేసు(A case of fraud)లో వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరుకాక పోవడంతో బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్‌పై పంజాబ్‌లోని లుథియానా కోర్టు(Court of Ludhiana, Punjab) అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కేసు వివరాల్లోకి వెళితే.. మోహిత్‌శర్మ అనే వ్యక్తి రిజికా కాయిన్ పేరుతో తనతో రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టించి మోసం చేశాడని లుథియానాకు చెందిన న్యాయవాది రాజేశ్‌ఖన్నా కోర్టులో కేసు వేశారు. ఈ కేసులో ఆయన సోనూ సూద్‌ను సాక్షి(Witness Sonu Sood)గా పేర్కొన్నారు. దీంతో పలుమార్లు సమన్లు(Summons) పంపినా ఆయన కోర్టుకు హాజరు కాలేదంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Related Posts

Hansika: బాంబే హైకోర్టును ఆశ్రయించిన హన్సిక.. ఎందుకో తెలుసా?

తనపై నమోదైన గృహ హింస కేసును కొట్టివేయాలంటూ హీరోయిన్ హన్సిక (Hansika) బాంబే హైకోర్టు(High Court of Bombay)ను ఆశ్రయించింది. ఈ మేరకు గురువారం క్వాష్‌ పిటిషన్‌(Quash petition) దాఖలు చేసింది. తన సోదరుడి భార్య ఫిర్యాదుతో హన్సికతో సహా ఆమె…

బెట్టింగ్ యాప్స్ ఇష్యూ.. వారిని అరెస్ట్ చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా: KA పాల్

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్(Betting Apps Issue) వ్యవహారం సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల(Cine Celebrities)పై కేసు నమోదు కాగా.. నిన్న రామారావు అనే వ్యక్తి నందమూరి బాలకృష్ణ(Balakrishna), ప్రభాస్(Prabhas), గోపీచంద్‌పై ఫిర్యాదు చేశాడు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *