పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు(Parliament Budget Sessions) ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu) ప్రసంగించారు. తమ లక్ష్యం భారతదేశాన్ని గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్‌హౌస్‌గా మార్చడమని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో.. ఇండియా ఏఐ మిషన్ ప్రారంభమైందని చెప్పారు. అంతకుముందు పార్లమెంట్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చ జరగాలని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు. దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజలపై లక్ష్మీదేవి కరుణ చూపాలని ఆకాంక్షించారు. బడ్జెట్ సమావేశాల్లో అర్థవంతమైన చర్చ(For meaningful discussion)కు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు.
విపక్షాలు మద్దతు తెలపాలి: మోదీ
ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులకు విపక్షాలు మద్దతు(Opposition supports the bills) తెలపాలని కోరుతున్నానని చెప్పారు. వికసిత్ భారత్(Vikasit Bharat)కు ఈ బడ్జెట్ ఊతమిస్తుందని అన్నారు. రీఫామ్, పర్ఫామ్, ట్రాన్స్ఫామ్ లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని మోదీ తెలిపారు. ఇన్నోవేషన్(Innovation), ఇన్ క్లూజన్, ఇన్వెస్ట్ మెంట్ లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. కొత్త విధానాలతో ఆర్థిక ప్రగతి(Economic Progress) సాధ్యమవుతుందని అన్నారు. అంతర్జాతీయంగా మన దేశ పరపతి పెరుగుతోందని చెప్పారు. 2047 కల్లా మన దేశం వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకుంటుందని PM అన్నారు.
Speaking at the start of the Budget Session of Parliament. https://t.co/IC4Sk4Ppub
— Narendra Modi (@narendramodi) January 31, 2025






