ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025) ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌కు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ మ్యాట్ హెన్రీ(Matt Henry) గాయపడ్డాడు. బుధవారం సౌతాఫ్రికా(South Africa)తో జరిగిన మ్యాచులో క్లాసెన్ క్యాచ్ అందుకునే క్రమంలో గాయపడ్డాడు. దీంతో భుజం నొప్పి(Shoulder pain)తో అల్లాడిన హెన్రీ వెంటనే మైదానాన్ని వీడి ఫిజియో దగ్గర చికిత్స తీసుకున్నాడు. కొంత సమయం తర్వాత రెండు ఓవర్లు బౌలింగ్ వేశాడు. కానీ సౌకర్యంగా కనిపించలేదు. అయితే మరో రెండు రోజుల్లో ఫైనల్ మ్యాచ్ ఉండటంతో హెన్రీ గాయం ఇప్పుడు కివీస్‌కు పెద్ద ఎదురుదెబ్బేనని మాజీ క్రికెట్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం హెన్రీ వైద్య చికిత్స తీసుకుంటున్నాడు.
ఆందోళనలో కివీస్ జట్టు
కాగా లాహోర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో సెమీస్(Second Semis)లో హెన్రీ అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. 7 ఓవర్లు వేసి 43 రన్స్ ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు గ్రూప్ స్టేజీలో భారత్(India)తో జరిగిన మ్యాచ్‌లో హెన్రీ 8 ఓవర్లు వేసి 42 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లతో సత్తా చాటాడు. అయితే తాజాగా అతడు గాయపడటంతో ఆందోళనలో ఉంది కివీస్ జట్టు.
As an orthopedic specialist, I’m observing a potentially significant injury in Matt Henry’s case. Based on what I’m seeing, a minimum of one week of rest is absolutely crucial to prevent further complications. Pushing through this could lead to long-term issues. 🙏#NZvsSA pic.twitter.com/ZTMwMd3Vzy
— Sir BoiesX (@BoiesX45) March 5, 2025
అయితే ఫైనల్ మ్యాచ్‌కి కాస్త సమయం ఉంది. ఇంతలో నయం అవుతుందని కివీస్ జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. కాగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్(India vs New Zealand) మధ్య మార్చి 9న దుబాయ్(Dubai) వేదికగా మధ్యాహ్నం 2.30గంటలకు ఫైనల్(Final) మ్యాచ్ ప్రారంభం కానుంది.






