హిట్స్, ప్లాప్స్తో సంబంధంల లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది తెలుగు బ్యూటీ శ్రీలీల (Sreeleela). ఓవైపు స్టార్ హీరోలతో కలిసి పనిచేస్తూనే.. మరోవైపు కొత్త కుర్రాళ్లలో జోడీ కడుతోంది. తాజాగా ఆమె గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి (Kireeti Reddy)తో కలిసి ‘జూనియర్’ (Junior) అనే మూవీలో నటించింది. ఇప్పడు వైరల్ అవుతున్న ‘వైరల్ వయ్యారి’ ఈ మూవీలోనిదే. ఈ చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగులోనూ జూలై 18న రిలీజ్ చేస్తున్నారు.
ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా
అయితే స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న శ్రీలీల సాధారణంగా రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటోంది. అయితే జూనియర్ కోసం మాత్రం ఈమె తన రెమ్యునరేషన్ను డబుల్ చేసినట్లు తెలుస్తోంది. రూ.4 కోట్ల పారితోషికం తీసుకుందని టాక్ నడుస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలు తీసే వారాహి నిర్మాణ సంస్థ ఈ మూవీకి కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీస్తోంది. అందుకే శ్రీలీలకు రూ.4 కోట్లు ఇచ్చి ఒప్పించినట్లు తెలుస్తోంది.
రీ ఎంట్రీ ఇస్తున్న జెనీలియాకు కూడా..
జూనియర్ మూవీకి రాధాకృష్ణ రెడ్డి డైరెక్షన్ వహించారు. ఈ చిత్రంతో చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న జెనీలియాకు (Genelia) కూడా భారీగానే రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం. తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad), రాజమౌళి చిత్రాలకు సినిమాటోగ్రాఫీ చేసే సెంథిల్ కుమార్ ఈ మూవీకి పనిచేస్తున్నారు. వారికి కూడా పెద్ద మొత్తంలో ముట్టజెప్పారని టాక్ నడుస్తోంది.






