Mana Enadu: ఐపీఎల్(IPL) మెగా వేలానికి ముందు జరిగిన రిటెన్షన్(Retention)లో ఊహించినట్లుగానే సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) ఫ్రాంచైజీ ఐదుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకుంది. సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్(Heinrich Klassen)కు అత్యధికంగా రూ.23 కోట్లు చెల్లించనుంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రూ.18 కోట్లు, యంగ్ డ్యాషింగ్ ఓపెనర్లు అభిషేక్ శర్మ రూ.14 కోట్లు, ట్రావిస్ హెడ్ రూ.14 కోట్లు, తెలుగు ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) రూ.6 కోట్లకు SRH రిటైన్ చేసుకుంది. అయితే చాలా కాలంగా హైదరాబాద్ జట్టుకు ఆడుతున్న భువనేశ్వర్ కుమార్‌తో పాటు ఎయిడెన్ మార్క్రమ్, నటరాజన్, ఆల్ రౌండర్లు వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్‌లను మెగా వేలానికి వదిలేసింది.
వారిపై గట్టి నమ్మకంతోనే..
కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(Indian Premier League)లో హెన్రిచ్ క్లాసెన్‌ను అట్టిపెట్టుకోవడానికి ఏకంగా రూ.23 కోట్ల భారీ మొత్తాన్నిసన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఖర్చు చేసింది. ఇప్పటి వరకూ ప్రకటించిన రిటెన్షన్ లిస్ట్‌లో ఇదే హయ్యెస్ట్. క్లాసెన్ గత సీజన్‌లో చెలరేగిపోవడంతో ఈసారి రిటెన్షన్ జాబితాలో అతడిని పెద్ద ధర పెట్టుకుని మరి నిలుపుకుంది. ఇక గత సీజన్‌లో జట్టును ఫైనల్ చేర్చిన కమిన్స్‌పైన ఈసారీ నమ్మకముంచింది. ఓపెనర్లు అభిషేక్, హెడ్ ఈసారి కూడా గత మెరుపులు మెరిపించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. కేవలం ఈ ఐదుగురు ప్లేయర్లకే SRH ఫ్రాంచైజీ ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు చేయడం విశేషం.
ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
ఇదిలా ఉండగా రిటెన్షన్ విధానంలో SRH తీసుకున్న నిర్ణయాల పట్ల అభిమానులు(Fans) హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము కోరుకున్న ప్లేయర్లనే మేనేజ్మెంట్ రిటైన్ చేసుకుందని సంబురపడుతున్నారు. ఈ ఐదుగురు టీంలో ఉండటం వల్ల ఈసారి కూడా సిక్సర్ల మోత మోగబోతోందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా గత ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ జట్టు మొత్తం 178 సిక్సర్లు నమోదు చేసింది.
Presenting our retained Risers for #IPL2025 🧡 #PlayWithFire🔥💥 #SRH #OrangeArmy pic.twitter.com/S2xwqsWhb1
— SunRisers Hyderabad (@SunRisers) October 31, 2024








