
Mana Enadu : దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) అప్పుడప్పుడు తన స్టెప్పులతో ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేస్తుంటారు. ఇంతకుముందు తన కుమారుడు కార్తికేయ వివాహం సమయంలో సంగీత్ వేడుకలో డ్యాన్స్ చేసి అలరించారు. తాజాగా తన కుటుంబంలోని మరో సభ్యుడి వివాహ వేడుకలో జక్కన్న కాలు కదిపారు. ఈసారి ఏకంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర (Devara) మూవీలోని ఆయుధ పూజ పాటకు స్టెప్పులేసి సర్ ప్రైజ్ చేశారు రాజమౌళి.
శ్రీసింహా వెడ్స్ రాగ మాగంటి
ఆస్కార్ విన్నర్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్.ఎమ్. కీరవాణి (MM Keeravani) ఇంట్లో ఇటీవలే పెళ్లి బాజాలు మోగిన విషయం తెలిసిందే. ఆయన చిన్న కుమారుడు, మత్తు వదలరా ఫేం శ్రీ సింహా (Sri Simha) తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్ (Murali Mohan) మనవరాలు రాగ మాగంటి (Raaga Maganti)తో శ్రీసింహ పెళ్లి జరిగింది. దుబాయ్ లో వీరి వివాహ వేడుక అతికొద్ది మంది బంధువుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
ఆయుధపూజ పాటకు జక్కన్న స్టెప్పులు
ఇటీవలే శ్రీసింహా, రాగమయూరి పెళ్లికి సంబంధించి ఫొటోలు (Sri Simha Wedding Photos) కూడా వైరల్ అయ్యాయి. ఇక తాజాగీ ఈ వేడుకకు సంబంధించి మరికొన్ని వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఓ వీడియోలో రాజమౌళి డ్యాన్స్ (Rajamouli Dance Video) చేయడం కనిపించింది. శ్రీసింహా వివాహ వేడుకలో రాజమౌళి దంపతులు అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని ‘లంచ్ కొస్తావా మంచె కొస్తావా’ పాటకు స్టెప్పులేశారు. ఇదే వేడుకలో రాజమౌళి ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాలోని ‘ఆయుధ పూజ (Devara Aayudha Puja Song)’ పాటకు డ్యాన్స్ చేశారు. ఈ పాటకు కీరవాణి పెద్ద కొడుకు కాల భైరవతో కలిసి జక్కన్న కాలు కదిపారు.
డైరెక్షన్ అయినా డ్యాన్స్ అయినా
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. జక్కన్న తన సినిమా షూటింగు సమయంలో ఎంత సీరియస్ గా ఉంటాడో.. కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు అంత జాలీగా ఉంటాడని నెటిజన్లు అంటున్నారు. మన జక్కన్న కూడా ఎన్టీఆర్ (NTR Devara) ఫ్యానే అంటూ తారక్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. డైరెక్షన్ అయినా.. డ్యాన్స్ అయినా.. రాజమౌళికి సాటిరారు ఎవ్వరూ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆయుధపూజ పాటకు జక్కన్న స్టెప్పులు అదుర్స్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం జక్కన్న వీడియో బాగా ట్రెండ్ అవుతోంది.