టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu), డైరెక్టర్ రాజమౌళి(Rajamouli) కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ ‘SSMB 29’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్ తాత్కాలికంగా ‘SSMB 29’ అనే టైటిల్‌తో పిలవబడుతున్నప్పటికీ, దీనికి సంబంధించిన అధికారిక టైటిల్ త్వరలో వెల్లడికానుంది.
ఈ మూవీ జానర్ విషయంలో ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన మేకర్స్, ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కీలక పాత్రలో నటిస్తోంది. ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు సమాచారం. తాజాగా తమిళ హీరో ఆర్. మాధవన్(R. Madavan) ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్రలో నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రాన్ని లెజెండరీ ప్రొడ్యూసర్ కెఎల్ నారాయణ తమ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భారీగా రూ.1,000 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా రూపొందనుంది. తొలి భాగాన్ని 2027లో, రెండో భాగాన్ని 2029లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి పనిచేస్తుండగా, కథను రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ అందిస్తున్నారు. డైలాగ్ రైటింగ్ బాధ్యతలు దర్శకుడు దేవా కట్ట నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అత్యాధునిక సాంకేతికతతో, ఇంటర్నేషనల్ లొకేషన్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా, భారత సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలవనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.






