రవితేజ సోదరుడు మాధవ్ హీరోగా ‘మారెమ్మ’ ఫస్ట్ లుక్ రిలీజ్..

టాలీవుడ్‌ మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) సోదరుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్( Madhav ) హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘మారెమ్మ’( ‘Maremma’ ) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాను మోక్ష ఆర్ట్స్‌ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. చిత్రానికి మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. కథానాయికగా దీపా బాలు నటిస్తున్నారు.

పవర్‌ఫుల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో దర్శకుడు నాగరాజ్(Director Nagaraj) మాధవ్‌ను ఫెరోషియస్, రగ్డ్ లుక్‌లో ప్రజెంట్ చేస్తున్నారు. ఈ పాత్ర కోసం మాధవ్ తనలో భారీ మేకోవర్‌ చేసుకున్నట్టు చిత్రబృందం తెలిపింది. ఇప్పటికే టైటిల్‌ను ప్రకటించి, ఫస్ట్‌లుక్‌(‘Maremma’ First Look)ను విడుదల చేశారు. లుక్‌కు మంచి స్పందన లభిస్తోంది.

ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉమేష్ విలాసాగరం, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి కందాలా పని చేస్తున్నారు. సినిమాటోగ్రఫీని ప్రశాంత్ అంకిరెడ్డి అందిస్తుండగా, సంగీతం ప్రశాంత్ ఆర్ విహారి అందిస్తున్నారు. గ్రామీణ నేపథ్యానికి తగినట్లుగా సాంకేతిక విభాగాలను అద్భుతంగా సమకూర్చినట్టు యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు. ‘మారెమ్మ’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కుతోందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *