SSMB29: మహేశ్​ మూవీ కోసం ఎదురుచూస్తున్నా: ప్రియాంకా చోప్రా

మహేశ్‌ బాబు (Mahesh Babu), దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్​లో ‘SSMB29’ వర్కింగ్‌ టైటిల్‌తో ఓ భారీ బడ్జెట్​ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. హాలీవుడ్​ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంగ్లీష్​ మీడియాతో మాట్లాడారు. వివాహం తర్వాత హాలీవుడ్‌లో స్థిరపడిన ప్రియాంక తాను ఇండియన్​ సినిమాలను మిస్‌ అవుతున్నట్లు చెప్పారు. తాను ప్రస్తుతం ఓ భారతీయ సినిమాలో నటిస్తున్నట్లు చెప్పిన ఆమె.. ఆ ప్రాజెక్ట్‌ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

SSMB29: Priyanka Chopra to collaborate with Mahesh Babu for SS Rajamouli's  action-adventure biggie? – Firstpost

ఇండియన్​ సినిమాకు కమ్​బ్యాక్​ మాత్రమే కాదు..

‘‘నేను ఇండియాను, హిందీ సినిమాలను మిస్ అవుతున్నాను. ఈ సంవత్సరం ఓ భారతీయ సినిమాలో నటిస్తున్నాను. ఆ ప్రాజెక్ట్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇండియన్‌ ఆడియన్స్‌ నాపై చూపే ప్రేమ ఎంతో విలువైంది. అది ఎల్లప్పుడూ ఇలానే కొనసాగుతుందని ఆశిస్తున్నా. ఈ మూవీ ఇండియన్​ సినిమాకు కేవలం కమ్​బ్యాక్​ కాదని, ఇంటికి తిరిగి వెళ్తున్న ఫీలింగ్​ ఉంది’’ అని అన్నారు. అయితే ప్రియాంక ఏ సినిమా గురించో మాత్రం చెప్పలేదు. అయితే ఆమె ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ గురించే మాట్లాడిందని అభిమానులు పేర్కొంటున్నారు. త్వరలోనే ఆమె ఈ మూవీ సెట్స్​ అడుగుపెట్టనున్నట్లు చర్చించుకుంటున్నారు.

ఏడు ఆఫ్రికన్​ దేశాల్లో షూటింగ్​!

ప్రస్తుతం SSMB29 షూటింగ్‌ జరుగుతోంది. అటవీ నేపథ్యంలో సాగే కథతో ప్రపంచాన్ని చుట్టేసే సాహస ప్రయాణంగా ఈ సినిమాని సిద్ధం చేస్తున్నారు రాజమౌళి. ఇందులో మహేశ్‌ మునుపెన్నడూ చేయని ఓ విభిన్నమైన పాత్రలో.. సరికొత్త లుక్‌తో అలరించనున్నారు. ఇప్ప‌టికే రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకున్న మూవీ.. భారీ ఖర్చుతో కాశీ న‌గ‌రానికి సంబంధించిన ఓ ప్ర‌త్యేక సెట్​లో కొద్దిరోజులుగా షూటింగ్​ జరుగుతున్న సమాచారం. మ‌హేశ్​ బాబు, పృధ్వీరాజ్ సుకుమార‌న్ స‌హా మెయిన్​ క్యారెక్టర్లపై కీల‌క యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆఫ్రికా ఖండంలో మొత్తంగా ఏడు దేశాల్లో షూటింగ్ ఉంటుంద‌ని స‌మాచారం.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *