సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu), మాస్ డైరెక్టర్ రాజమౌళి(Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ఎస్ఎస్ఎంబీ 29(SSMB29). ఈ సినిమా పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ మూవీ జానర్ విషయంలో ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన మేకర్స్, ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కీలక పాత్రలో నటిస్తోంది.
ఇంతకుముందు ఈ చిత్రం నిధి అన్వేషణ నేపథ్యంలో సాగుతుందన్న ప్రచారం జోరుగా సాగింది. అంతేకాదు, ఈ కథను ఆఫ్రికన్ అడవుల్లో ప్లాన్ చేస్తున్నారని, హాలీవుడ్ మూవీ మెకన్నాస్ గోల్డ్ తరహాలో ఈ కథ సాగుతుందని టాక్ వినిపించింది. అయితే తాజాగా ఈ చిత్ర కథపై మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ సినిమా కథ రామాయణంతో సంబంధం ఉంటుందని, ముఖ్యంగా సంజీవని కోసం హీరో చేసే సాహసాలు ప్రధానంగా ఉండబోతున్నాయని సమాచారం. అంటే రామాయణ కాలంలో హనుమంతుడు సంజీవని కోసం హిమాలయాలకు వెళ్లిన కథను ఆధారంగా తీసుకొని ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ చిత్రాన్ని అడవులు, కొండలు వంటి నేచురల్ లొకేషన్స్‌లో ఎక్కువగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
మరో ఆసక్తికర విషయం ఏంటంటే, మహేష్ బాబు హనుమంతుని పాత్రలో నటించనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇంతవరకు రాజమౌళి ఎస్ఎస్ఎంబీ 29 గురించి మీడియాకు స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. తన గత సినిమాలకు ప్రెస్‌మీట్ ద్వారా కథ, జానర్, తారాగణంపై క్లారిటీ ఇచ్చిన జక్కన్న, ఈసారి మాత్రం పూర్తి నిశ్శబ్దంలోనే పనులు పూర్తి చేస్తున్నారు.






