తెలంగాణలో కాంగ్రెస్ మంత్రులు (Congress Ministers) రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పర్యటించినా ఇటీవల హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. స్వల్ప దూరానికి కూడా చాపర్లను వాడటం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల మంత్రి దామోదర రాజనర్సింహ ఏకంగా సొంత పార్టీ మంత్రులపై ఈ విషయంలో సంచలన వ్యాఖ్యలు కూడా చేసిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Accident) హెలికాప్టర్ ప్రయాణంలో స్వల్ప ప్రమాదం జరిగింది.
బ్రేకింగ్ న్యూస్
మంత్రుల హెలికాప్టర్ అతి వాడకం ఎక్కువ అయిందని ప్రకృతి కూడా ఆగ్రహం
హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో వీచిన గాలికి కూలిన స్వాగతం వేదిక
నిజామాబాద్, రైతు మహోత్సవం కార్యక్రమం కోసం హాజరవడం కోసం హెలికాప్టర్ లో వచ్చిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు,… pic.twitter.com/DrMzWBNyeH
— Telugu Scribe (@TeluguScribe) April 21, 2025
హెలికాప్టర్ ప్రమాదం
ఇక తాజాగా హెలికాప్టర్ ల్యాండింగ్ (Helicopter Landing Issue) సమయంలో వీచిన గాలికి ఏకంగా వేదిక కూలింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. నిజామాబాద్ లో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతు మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర రావు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి వీరు హెలికాప్టర్లో వచ్చారు. అయితే హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.
కూలిన స్వాగత వేదిక
హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో వీచిన గాలికి రైతు మహోత్సవం స్వాగత వేదిక (Stage Collapse in Nizamabad) కూలిపోయింది. ఒక్కసారిగా వేదిక కూలడంతో ఆ ప్రాంతంలో ఉన్న వారు దాని కిందే చిక్కుకున్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో పోలీసులు కూడా ఉన్నారు. వేదిక కూలగానే జనం ఒక్కసారిగా పరుగులు తీశారు. ఆ ప్రాంతమంతా దుమ్ముతో నిండిపోయింది. ఈ ఘటనలో పలువురు అస్వస్థకు గురయ్యారు.






