మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు(Maharashtra & Jharkhand Assembly Elections) ముగిశాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఇండియా కూటమి(INDIA Alliance) అధికారంలోకి వస్తుందని ఆ కూటమి నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ.. మహారాష్ట్రలో ఊహించని రిజల్ట్స్ వచ్చాయి. BJP నేతృత్వంలోని మహాయుతి(Mahayuthi) బంపర్ మెజార్టీతో విజయం సాధించింది. 288 అసెంబ్లీ సీట్లలో ఏకంగా 235 చోట్ల గ్రాండ్ విక్టరీ కొట్టింది. ప్రతిపక్షంలోని మహా వికాస్ అఘాడీ కూటమి(Maha Vikas Aghadi)కి అతి కష్టంమీద 49 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే MHలో చిత్తుగా ఓడిపోయిన MVA దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతోంది. తమ పరాభవానికి EVMలే కారణమని భావిస్తోంది. వాటిని తీసేసి మళ్లీ బ్యాలెట్ వ్యవస్థ(Ballot system) అమలు కోసం నిరసనలు చేపట్టనుందని తెలుస్తోంది. ఇందుకోసం కోర్టుల్లో పోరాడేందుకు కాంగ్రెస్, NCP SP, SS UBT లీగల్ టీమ్స్నూ ఏర్పాటు చేస్తున్నాయి.
లీగల్ టీమ్స్ ఏర్పాటుకు నిర్ణయం
ఈ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్(Tampering of EVMs) జరిగిందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. అందువల్లే తాము ఓడిపోయామని, లేదంటే తప్పకుండా తమ కూటమి అధికారంలోకి వచ్చేదే అని అంటున్నారు. MVAలో భాగమైన కాంగ్రెస్, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు EVMల ట్యాంపరింగ్ జరిగిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓటమి చెందిన స్థానాల్లో బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నిరసనలు చేపట్టాలని భావిస్తున్నారు. ఇందుకు దేశ, రాష్ట్రస్థాయిలో లీగల్ టీమ్స్ ఏర్పాటు చేయాలని అన్ని ప్రతిపక్ష పార్టీలను కోరుతున్నాయి. అటు మహారాష్ట్ర ఎన్నికల ఫతిలాలపైనా కోర్టును ఆశ్రయించాలని కూటమి నేతలు సిద్ధం అయ్యారు.
రాహుల్ గాంధీ నేతృత్వంలో పాదయాత్ర
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) నేతృత్వంలో దేశవ్యాప్తంగా EVMsకు వ్యతిరేకంగా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు హరియాణా ఎన్నికల ఫలితాల తరువాత కూడా కాంగ్రెస్ పార్టీ EVMలపై అనుమానాలు వ్యక్తం చేసింది. అన్ని సర్వేలు కాంగ్రెస్ కూటమి గెలుపు ఖాయమని వెల్లడించారు. కానీ.. చివరకు అక్కడ కాంగ్రెస్ బోల్తాపడింది. అక్కడ కూడా ఈవీఎం మెషీన్లను ముందుగానే హ్యాక్(Hack) చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కూటమి.. ఝార్ఖండ్(Jharkhand)లో విజయంపై మాత్రం ఎలాంటి సందేహాలు లేవని చెబుతుండటం గమనార్హం.