
‘‘ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే ఎన్నో విషయాలు మా ‘జటాధర(Jatadhara)’ చిత్రంలో ఉన్నాయంటు’’న్నాడు హీరో సుధీర్‌బాబు(Sudheer Babu). ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని వెంకట్ కల్యాణ్(Venkat Kalyan) తెరకెక్కిస్తున్నారు. ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నఈ చిత్ర సెకండ్ లుక్ గతేడాది విడుదల ఆకట్టుకుంది. అందులో సుధీర్ బైక్‌పై వస్తుండగా.. ఆకాశంలో ఓ మహాశక్తి అవతారం గర్జిస్తూ కనిపించడం ఆసక్తిరేకెత్తించేలా ఉంది. పైగా దానిపై సుధీర్‌బాబు స్పందిస్తూ ‘‘ఈ చిత్రంలోకి అడుగు పెట్టడం నాకు ఓ సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. మర్చిపోలేని అనుభవమిది. శాస్త్రీయ, పౌరాణిక అంశాల మేళవింపుతో ఈ కథను రాశారు. ఈ రెండు జానర్స్‌కు చెందిన ప్రపంచాల్ని వెండితెరపై చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఓ సరికొత్త అనుభూతిని పొందుతారు. విజువల్‌గా, ఎమోషనల్‌గా ఓ అద్భుతమైన సినిమాని ప్రేరణ రూపొందిస్తున్నారు’’ అన్నాడు.
అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరిగే కథ
ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు సగ భాగం షూటింగ్ హైదరాబాద్‌లోనే పూర్తి చేసింది మూవీ టీమ్. ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకొస్తుందని చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరిగే కథగా తెలుస్తోంది. అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, పురాణ చరిత్ర.. ఇలా అన్నింటినీ ఈ మూవీలో చూపించనున్నట్లు సమాచారం. తాజాగా జటాధర మూవీ టీజర్(Teaser) ఈ నెల 8న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
SUDHEER BABU – SONAKSHI SINHA: ‘JATADHARA’ FIRST LOOK UNVEILED – TEASER ARRIVES ON 8 AUGUST 2025… The #FirstLook poster of #Jatadhara – a mythic supernatural thriller – is out now.#JatadharaTeaser drops on [Friday] 8 Aug 2025.
Starring #SudheerBabu and #SonakshiSinha, the… pic.twitter.com/qnniVqA366
— taran adarsh (@taran_adarsh) August 4, 2025