పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేతిలో ప్రస్తుతం ఎనిమిది సినిమాలున్నాయి. వాటిలో ప్రస్తుతం మారుతితో వస్తున్న ది రాజాసాబ్ (The Raja Saab), హను రాఘవపూడితో చేస్తున్న చిత్రంతో డార్లింగ్ బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ (Spirit) చేయనున్నట్లు తెలిసింది. ఇక ఆ తర్వాత ప్రశాంత్ వర్మతో ఓ చిత్రం, కల్కి-2, సలార్-2, సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరో సినిమా, లోకేశ్ కనగరాజ్ తో ఓ చిత్రం ఇలా ఓ పెద్ద లైన్ ఉంది.
ప్రభాస్ తో ఢీ కొట్టేందుకు
అయితే ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) సినిమాపై ఫోకస్ చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఇమాన్వీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఫౌజీ (Fauji)’ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. లవ్ అండ్ వార్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ను ఢీ కొట్టే విలన్ పాత్రలో ఎవరు నటిస్తారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అయితే ఆ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో కనిపించనున్నట్లు ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
టాలీవుడ్ విలన్స్ డియోల్ బ్రదర్స్
బీ టౌన్ స్టార్ నటుడు సన్నీ డియోల్ (Sunny Deol) ప్రభాస్ ను ఢీకొట్టే పాత్రలో ఫౌజీలో విలన్ గా కనిపించనున్నట్లు సమాచారం. ఈ ఇద్దరి మధ్య బలమైన యాక్షన్ సీన్స్ ఉంటాయని తెలిసింది. ప్రభాస్ తో ఫైట్ చేయాలంటే అంతటి స్టామినాతో పాటు కటౌట్ ఉన్న నటుడు కావాలని హను భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే ఈ పాత్రకు సన్నీ సరిగ్గా సూట్ అవుతాడని అనుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే సన్నీ బ్రదర్ బాబీ డియోల్ యానిమల్ తో పాటు పలు తెలుగు సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే.






