Fauji : ప్రభాస్-హను మూవీలో విలన్ గా బాలీవుడ్ స్టార్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేతిలో ప్రస్తుతం ఎనిమిది సినిమాలున్నాయి. వాటిలో ప్రస్తుతం మారుతితో వస్తున్న ది రాజాసాబ్ (The Raja Saab), హను రాఘవపూడితో చేస్తున్న చిత్రంతో డార్లింగ్ బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ (Spirit) చేయనున్నట్లు తెలిసింది. ఇక ఆ తర్వాత ప్రశాంత్ వర్మతో ఓ చిత్రం, కల్కి-2, సలార్-2, సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరో సినిమా, లోకేశ్ కనగరాజ్ తో ఓ చిత్రం ఇలా ఓ పెద్ద లైన్ ఉంది.

ప్రభాస్ తో ఢీ కొట్టేందుకు

అయితే ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) సినిమాపై ఫోకస్ చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఇమాన్వీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఫౌజీ (Fauji)’ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. ల‌వ్ అండ్ వార్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ను ఢీ కొట్టే విలన్ పాత్రలో ఎవరు నటిస్తారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అయితే ఆ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో కనిపించనున్నట్లు ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

టాలీవుడ్ విలన్స్ డియోల్ బ్రదర్స్

బీ టౌన్ స్టార్ నటుడు సన్నీ డియోల్ (Sunny Deol) ప్రభాస్ ను ఢీకొట్టే పాత్రలో ఫౌజీలో విలన్ గా కనిపించనున్నట్లు సమాచారం. ఈ ఇద్దరి మధ్య బలమైన యాక్షన్ సీన్స్ ఉంటాయని తెలిసింది. ప్రభాస్ తో ఫైట్ చేయాలంటే అంతటి స్టామినాతో పాటు కటౌట్ ఉన్న నటుడు కావాలని హను భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే ఈ పాత్రకు సన్నీ సరిగ్గా సూట్ అవుతాడని అనుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే సన్నీ బ్రదర్ బాబీ డియోల్ యానిమల్ తో పాటు పలు తెలుగు సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *