SRH vs DC: విజృంభించిన SRH బౌలర్లు.. స్వల్ప స్కోరుకే DC కట్టడి

ఉప్పల్ స్టేడియం(Uppal Stadium)లో ఢిల్లీ(DC)తో జరుగుతున్న మ్యాచులో సన్ రైజర్స్(SRH) బౌలర్లు విజృంభించారు. తప్పక నెగ్గాల్సిన మ్యాచులో ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు ప్యాట్ కమిన్స్(Pat Cummins), జయదేవ్, హర్షల్, మలింగ అద్భుత బౌలింగ్‌తో జూలు విదిల్చారు. దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లో 133/7 పరుగులకే పరిమితమైంది. ఈ జట్టులో స్టబ్స్ (41*) అశుతోశ్ శర్మ (41), విప్రాజ్ నిగమ్ (18), కేఎల్ రాహుల్ (10) మినహా వారంతా విఫలమయ్యారు.

కీలక మ్యాచులో సన్ రైజర్స్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) సూపర్ బౌలింగ్‌తో అదరగొట్టాడు. ఢిల్లీ(DC) టాపార్డర్ బ్యాటర్లు కరుణ్ నాయర్ (0), డుప్లెసిస్ (3), అభిషేక్ పొరేల్ (8) పెవిలియన్ చేర్చి SRHకి శుభారంభాన్నిచ్చాడు. ఈ మ్యాచులో రైజర్స్ గెలవాల్సంటే 134 పరుగులు అవసరం. కాగా ఈ మ్యాచుకు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది.

Image

Related Posts

India vs Pakistan: భార‌త్ భీక‌ర దాడుల‌తో పాక్ వ‌ణికిపోయింది

భార‌త్ ఆప‌రేష‌న్ సిందూర్ లో భాగంగా పాక్ పై శ‌క్తిమంత‌మైన దాడుల‌తో విరుచుకుప‌డ‌టంలో పాకిస్థాన్ ప్ర‌పంచ దేశాల‌పై ప‌డి ఎలాగైనా స‌రే దాడుల‌ను ఆపాల‌ని వేడుకుంద‌ని కేంద్ర ర‌క్ష‌ణ శాఖ (Union Defence Minister Rajnath Singh) మంత్రి రాజ్ నాథ్…

Murali Mohan: గద్దర్ అవార్డ్స్‌.. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు మురళీ మోహన్ విన్నపం!

తెలంగాణలో గద్దర్ అవార్డులు(Telangana Gaddar Awards) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్(Murali Mohan) ఓ కీలక సూచన చేశారు. ఆంధ్రప్రదేశ్‌(AP)లో కూడా రాష్ట్ర ప్రభుత్వం సినిమా అవార్డుల(Movie Awards)ను ప్రకటించాలని కోరారు. తెలుగు సినిమా(Telugu…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *