ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు ఉపేంద్ర(Upendra) తన ఆరోగ్యంపై ఇటీవల వస్తున్న వార్తలను ఖండించారు. తాను సంపూర్ణ ఆరోగ్యం(Perfectly healthy)గా ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సామాజిక మాధ్యమాల(Social Media) ద్వారా స్పష్టం చేశారు. సాధారణ ఆరోగ్య పరీక్షల కోసమే తాను ఆసుపత్రికి వెళ్లినట్లు ఆయన వెల్లడించారు. కాగా కొంతకాలంగా ఉపేంద్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరారని SMలో ప్రచారం జరిగింది.
UI సినిమా చిత్రీకరణ సమయంలో..
ముఖ్యంగా ‘UI’ సినిమా చిత్రీకరణ సమయంలో ఆయనకు అనారోగ్య సమస్యలు(Health problems) తలెత్తాయని, అవి ఇప్పుడు తీవ్రమయ్యాయని ఆ కథనాల సారాంశం. ఈ వార్తలు SMలో వేగంగా వ్యాప్తి చెందడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. అభిమానుల ఆందోళన, మీడియా కథనాల నేపథ్యంలో ఉపేంద్ర స్వయంగా స్పందించారు.
ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ.. ನಾನು ಆರೋಗ್ಯವಾಗಿದ್ದೇನೆ.. ರೆಗ್ಯುಲರ್ ಚೆಕ್ ಅಪ್ ಗಾಗಿ ಆಸ್ಪತ್ರೆಗೆ ಭೇಟಿ ನೀಡಿದ್ದೆ ಅಷ್ಟೇ.. ಯಾವುದೇ ಊಹಾ ಪೋಹ ಗಳಿಗೆ ಕಿವಿಕೊಟ್ಟು ಗೊಂದಲಕ್ಕಿಡಾಗಬೇಡಿ.. ನಿಮ್ಮ ಪ್ರೀತಿ ಕಾಳಜಿಗೆ ಅನಂತ ಧನ್ಯವಾದಗಳು 🙏
— Upendra (@nimmaupendra) May 5, 2025
తన ఆరోగ్యం గురించి వస్తున్న పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. “నేను ఆరోగ్యంగానే ఉన్నాను. సాధారణ ఆరోగ్య పరీక్షల కోసమే ఆసుపత్రికి వెళ్ళాను. దయచేసి ఎలాంటి వదంతులు నమ్మకండి” అని సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.






