
IPL-2025లో భాగంగా కేకేఆర్‌తో మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ నెగ్గింది. ఈమేరకు SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఐపీఎల్ 2024 ఫైనల్‌లో తలపడ్డ కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఈ సీజన్‌లో ఇదే మ్యాచ్. కాగా గతేడాది సన్ రైజర్స్‌తో ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలిచిన KKR.. ఈసారి కూడా అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. అటు SRH మాత్రం ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది.ఈ మ్యాచ్ లైవ్‌ను జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో వీక్షించొచ్చు.
Toss
SRH vs KKRKKR Batting first #srhvskkr #TrumpTariffs
pic.twitter.com/wEEvD9xGDG— Hamza Khan (@imhamzakhax) April 3, 2025
10లో KKR.. 8వ స్థానంలో SRH
కాగా ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఈ రెండు జట్లూ కూడా ఆశించిన మేర ప్రదర్శన ఇవ్వలేకపోయాయి. గతేడాది పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లూ అగ్రస్థానంలో నిలిచాయి. కానీ ఈసారి మాత్రం ఆడిన మూడింట్లో రెండు మ్యాచ్‌లలో ఓడి.. 10, 8వ స్థానాల్లో KKR, SRH ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలని పట్టుదలతో ఉన్నాయి.
తుది జట్లు ఇవే..
KKR (ప్లేయింగ్ XI): క్వింటన్ డికాక్(WK), సునీల్ నరైన్, అజింక్యా రహానే(C), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి, రమణదీప్ సింగ్.
SRH (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్(WK), కమిందు మెండిస్, సిమర్జీత్ సింగ్, పాట్ కమిన్స్(C), హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, జీషన్ అన్సారీ