సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) సాధించింది.. అద్భుత ఆటతో చెపాక్‌లో చెన్నై(CSK)ని చిత్తు చేసింది. తప్పక గెలవాల్సిన మ్యాచులో సత్తా చాటింది. శుక్రవారం జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ అందుకుంది. దీంతో ప్లేఆఫ్స్(Playoffs) అవకాశాలను కాస్త మెరుగుపర్చుకుంది. బౌలింగ్, బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించి ఆకట్టుకుంది. చెపాక్‌లో గత 5 మ్యాచుల్లో ఓడిన రైజర్స్ నిన్నటి మ్యాచ్ ద్వారా తొలి విజయం సాధించినట్లైంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లో CSK ఓటముల పరంపర కొనసాగిస్తోంది. ఆఖరికి హోంగ్రౌండ్ అయిన చెపాక్‌లోనూ ఆ జట్టుకు అదృష్టం కలిసిరావట్లేదు. IPL హిస్టరీలో తొలిసారి ఆ జట్టు వరుసగా నాలుగు హోం మ్యాచ్‌లలో ఓడింది. దీంతో ఈ సారి ప్లేఆఫ్స్ అవకాశాలు ఏమైనా మిరాకిల్ జరిగితే తప్పా.. దాదాపు మూసుకుపోయినట్లే.
– Harshal Patel 4 wicket Haul
– k Mendis brilliance with both ball and Bat
– Ishan Kishan Absolute Saves in field
– Ishan brilliant 44
-Pat Cum with the ball and Captaincy
-Whole SRH as fielding Unit
– Complete team Performance 🔥#SRHvsCSK #CSKvSRH pic.twitter.com/wdG0VX7tJg— HomeLander_Raj (@RajHomelander) April 25, 2025
హర్షల్ దెబ్బకు.. చెన్నై బ్యాటర్లు విలవిల
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న SRH, చెన్నై సూపర్ కింగ్స్‌ను కట్టడి చేయడంలో పూర్తిగా సఫలమైంది. చెన్నై 19.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌట్ అయింది. ఆయుశ్ మాత్రే 30, జడేజా 21, బ్రెవిస్ 42, దూబే 12, హుడా 22 పరుగులు సాధించారు. కెప్టెన్ ధోనీ (6) నిరాశపర్చాడు.SRH బౌలర్లలో హర్షల్ పటేల్ (4/28) అద్భుత ప్రదర్శనతో చెన్నై పతనంలో కీలక పాత్ర పోషించాడు. అతడికి కమిన్స్ 2, ఉనద్కత్ 2, షమీ 1, మెండిస్ 1 వికెట్లు తీసి సహకారం అందించారు.
ఇషాన్.. మెండిస్ బాధ్యతాయుత ఇన్నింగ్స్
అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. అభిషేక్ శర్మ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే, ఇషాన్ కిషన్ (44 పరుగులు, 34 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ట్రావిస్ హెడ్ (19) పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత క్లాసెన్ (7), అనికేత్ వర్మ (19) త్వరగా ఔటైనా, చివర్లో కమిందు మెండిస్ (32*) నితీష్ కుమార్ రెడ్డి (19*) అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. సన్‌రైజర్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి, మరో 8 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు.
SRH edges CSK in thriller!
SRH chase down CSK’s 154 brilliantly.
Ishan Kishan’s 44 & Kamindu Mendis’ finish seal the deal.
Harshal Patel 4-28 with the ball.
SRH’s 1st win at Chepauk & 1st away win in IPL 2025! #SRHvsCSK #IPL2025 pic.twitter.com/dYWADs4LUX— Muhammad Areeb Uddin Sheikh. #AreebCricketWorld (@areeb_7official) April 25, 2025






