AR Rahman: కాపీరైట్ కేసు.. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌కు షాక్

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌కు ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) షాక్ ఇచ్చింది. పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ (Ponniyin Selvan 2) చిత్రంలోని పాటపై కాపీరైట్ కేసు(Copy Right Case)లో పిటిషన్‌దారుడికి రూ.2 కోట్లు చెల్లించాలని సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman), చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్‌ టాకీస్‌(Madras Talkies)ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. డైరెక్టర్ మణిరత్నం(Director Maniratnam) దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియన్ 2’ సినిమా 2023లో విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో విక్రమ్(Vikram), రవి మోహన్, కార్తి, త్రిష(Trisha), ఐశ్వర్యరాయ్(Aishwarya Rai) తదితరులు ముఖ్య పాత్రధారులు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.


తన పాటను కాపీ చేశారని సింగర్ ఫయాజ్ పిల్

అయితే ఈ మూవీలోని ‘వీరా రాజా వీరా’ పాట సంగీతాన్ని తన తండ్రి ఫయాజుదీన్ డగర్, మామ జాహిరుదీన్ డగర్ సంగీతం అందించిన ‘శివస్తుతి పాట’ నుంచి కాపీ చేసినట్టు గాయకుడు ఉస్తాద్ ఫయాజ్ వసిఫుదీన్ డగర్(Singer Ustad Fayaz Wasifuddin Dagar) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మధ్యంతర తీర్పు వెలువడింది. పిటిషనర్‌కు రూ.2కోట్లు చెల్లించడంతోపాటు సినిమాలో ఆయనకు క్రెడిట్(Credits) ఇవ్వాలని ఏఆర్ రెహమాన్, చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్‌ను ఆదేశించింది.

Delhi HC directs musician AR Rahman to deposit Rs 2 crore in copyright  infringement case

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *