వారెవ్వా.. వాట్ మ్యాచ్.. ఏమా ధైర్యం.. ఏమిటా హిట్టింగ్.. వరల్డ్స్ క్లాస్ బౌలర్లను చిత్తు చేస్తూ అభిషేక్ వర్మ చేసిన విధ్వంసం గురించి ఏమని చెప్పాలి.. ఎంతని చెప్పాలి.. ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) బ్యాటర్లు వైల్డ్ ఫైర్ అంటే ఏమిటో చూపించారు. భారీ టార్గెట్ ఛేదనలో యంగ్ మ్యాన్ అభిషేక్ శర్మ(55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్సర్లు 141 రన్స్) ఫెంటాస్టిక్ సెంచరీతో వన్ మ్యాన్ షో చూపించాడు. దీంతో SRH 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసింది. ఆరెంజ్ ఆర్మీ పవర్ ఏంటో చూపించింది.
రైజర్స్ బ్యాటర్ల హంటింగ్ ఎలా ఉందంటే..
పంజాబ్ నిర్దేశించిన 247 పరుగుల టార్గెట్‌ను హైదరాబాద్ మరో 9 బంతులు ఉండగానే ఛేదించేసింది. రైజర్స్ ఓపెనర్లు అభిషేక్(Abhishek Sharma), హెడ్ (Head) రికార్డు స్థాయిలో 12.2 ఓవర్లలో 171 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో హెడ్ (37 బంతుల్లో 66) రన్స్ చేసి ఔటయ్యాడు. అనంతరం వర్మకు బిగ్ మ్యాన్ క్లాసెన్(21*) తోడయ్యాడు. టార్గెట్‌ను పూర్తి చేసే క్రమంలో వర్మ (141) జట్టు స్కోరు 222 పరుగుల వద్ద ఔటయ్యాడు. అప్పటికే కింగ్స్‌కు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్(9)తో సాయంతో క్లాసెన్ మ్యాచ్‌ను ముగించేశాడు. దీంతో ఆరెంజ్ ఆర్మీ రికార్డు స్థాయిలో టార్గెట్‌ను ఛేదించిన రెండో జట్టుగా నిలిచింది. కింగ్స్ బౌలర్లలో చాహల్, అర్ష్ దీప్ చెరో వికెట్ తీశారు.
మొదట్లో ప్రభ్‌సిమ్రన్, అయ్యర్.. చివర్లో స్టొయినిస్
అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 245/6 భారీ స్కోరు సాధించింది. ఆ జట్టు బ్యాటర్లలో ప్రియాన్ష్ 36, ప్రభ్ సిమ్రాన్ 42, శ్రేయస్ 82, వధేరా 27, శశాంక్ 2, మ్యాక్స్ వెల్ 3, స్టొయినిస్ 34, జాన్సెన్ 5 పరుగులు చేశారు. రైజర్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ 4 వికెట్లు కూల్చగా.. ఇషాన్ మలింగా 2 వికెట్లు పడగొట్టారు. సూపర్ సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ (141)కు “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు దక్కింది. కాగా ఈ విజయంతో SRH 4 పాయింట్లతో పట్టికలో 7వ స్థానానికి ఎగబాకింది.
🚨 Indian Premier League 2025, PBKS vs SRH 🚨
Sunrisers Hyderabad won by 8 wickets
Top Performances
Abhishek Sharma – 141 (55)
Travis Head – 66 (37)
Heinrich Klaasen – 21* (14)Arshdeep Singh – 1/37
Yuzvendra Chahal – 1/56#SRHvsPBKS #SRHvPBKS #PBKSvsSRH #PBKSvSRH… pic.twitter.com/RFdGic6p6S— Sporcaster (@Sporcaster) April 12, 2025








CT 2025: అద్భుత విజయం.. మన ప్లేయర్లు అదరగొట్టారు: PM మోదీ
దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో(Champions Trophy final) టీమ్ఇండియా విజయం సాధించడంతో యావత్ భారవతాని పులకించిపోయింది. ODI ఫార్మాట్లో 8 ఏళ్ల తర్వాత నిర్వహించిన ఈ టోర్నీలో రోహిత్ సేన ఆల్ రౌండ్ ప్రదర్శన కనబర్చి ఛాంపియన్‌గా అవతరించింది. దీనిపై…