IPL-2025లో మరో జట్టు ఇంటిదారి పట్టింది. సోమవారం రాత్రి భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో లక్నో(LSG)పై సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 206 పరుగుల లక్ష్యాన్ని మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ క్రమంలో 18.2 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసింది.
సమష్టిగా రాణించారు..
సన్ రైజర్స్ జట్టులో ట్రావిస్ హెడ్(Travis Head) స్థానంలో వచ్చిన అధర్వ తైడే (13) పరుగులు చేసి అవుటైనప్పటికీ.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (59), ఇషాన్ కిషన్ (35), హెన్రిచ్ క్లాసెన్ (47), కమిందు మెండిస్ (32) రాణించడంతో విజయం నల్లేరుపై నడకే అయింది. చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి (5 నాటౌట్) గెలుపునకు అవసరమైన పరుగులు కొట్టి సన్ రైజర్స్ శిబిరంలో ఆనందం నింపాడు. లక్నో బౌలర్లలో దిగ్వేష్ రాఠీ 2, ఓరూర్కీ, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ తీశారు.
#IPL में प्लेऑफ की रेस से बाहर हुई लखनऊ! @SunRisers ने @LucknowIPL को 6 विकेट से हराया
पहले बल्लेबाजी करते हुए #LSG ने 7 विकेट पर बनाए 205 रन, जवाब में #SRH ने अभिषेक शर्मा की धमाकेदार 50 के दम पर 10 गेंद पहले आसानी से मैच जीता।#IPL2025 #LSGvsSRH #SRHvsLSG #SRHvLSG pic.twitter.com/dj4jUVrNKb
— हिंद उवाच (@TheHindUVAACH) May 19, 2025
లక్నో జట్టులో ఆ ముగ్గురే..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసి లక్నో ఓపెనర్లు మిచెల్ మార్ష్ (65), మార్క్రమ్ (61) చెలరేగడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. మిడిల్ ఆర్డర్ పూరన్ (45) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో 20 ఓవర్లకు 205/7 స్కోరు చేసింది. రైజర్స్ బౌలర్లలో మలింగ 2, దూబే, హర్షల్, నితీశ్ తలో వికెట్ తీశారు. కాగా, ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్(Playoffs) రేసులో నిలవాలన్న LSG ఆశలపై సన్ రైజర్స్ నీళ్లు చల్లారు.






