
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో అమీతుమీ తేల్చుకునేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో(Uppal) వేదికగా జరుగుతున్న 55వ మ్యాచులో టాస్ నెగ్గిన హైదరాబాద్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి చేరాలంటే SRH మిగతావి అన్నీ చావో రేవో మ్యాచ్‌లే. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ఇవాళ DCతో కాకుండా మరో 3 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. అన్నింటిలో భారీ తేడాతో గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌కు అవకాశం ఉంటుంది. మరోవైపు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉన్న ఢిల్లీ ఇవాళ గెలిచి ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగు పర్చుకోవాలని చూస్తోంది. కాగా ఇవాళ్టి మ్యాచులో ఇరుజట్లు పలు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి.
హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇలా..
ఇక ఐపీఎల్‌లో హైదరాబాద్, ఢిల్లీ మధ్య ఇప్పటివరకు 25 మ్యాచులు జరిగాయి. అందులో సన్ రైజర్స్ 13 మ్యాచులలో.. ఢిల్లీ 12 మ్యాచులలో గెలిచింది. హైదరాబాద్ వేదికగా ఆరు మ్యాచులు ఆడగా.. అందులో చెరో మూడు సార్లు విజయం సాధించాయి.
తుది జట్లు ఇవే..
Sunrisers Hyderabad: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(w), సచిన్ బేబీ, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(సి), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగ.
Delhi Capitals: ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, KL రాహుల్(w), అక్షర్ పటేల్(c), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్, T నటరాజన్.
Match 55@SunRisers vs @DelhiCapitals @SunRisers won the toss and chose to bowl first against @DelhiCapitals
🧡 SRH 👉 Sachin Baby & E Malinga comes in
💙 DC 👉 T Natarajan comes in #TATAIPL | #SRHvDC #DCvsSRH | #SRHvsDC— A2ZCRICKET (@a2zcric) May 5, 2025