Superman: సూపర్‌మ్యాన్: లెగసీ’ మరో రెండు రోజుల్లో గ్రాండ్ రిలీజ్‌.. గ్లోబల్‌గా భారీ అంచనాలు!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ భారీ చిత్రం ‘సూపర్‌మ్యాన్ (Superman): లెగసీ’(Legacy) ఈ నెల జూలై 11న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. డీసీ స్టూడియోస్ (DC Studios) రూపొందించిన ఈ చిత్రం, DC యూనివర్స్ (DCU)లో నిర్మిస్తున్న తొలి చిత్రం కావడం విశేషం. అదే సమయంలో, సూపర్‌మ్యాన్ ఫిల్మ్ సిరీస్‌లో రెండో రీబూట్ కావడం విశేష ఆకర్షణగా నిలిచింది.

ఈ చిత్రంలో డేవిడ్ కోరెన్‌స్వెట్ (David Corenswet) కొత్తగా సూపర్‌మ్యాన్ పాత్రలో దర్శనమివ్వనుండగా, రాచెల్ బ్రాస్నహన్, నికోలస్ హౌల్ట్, ఈడి గతేగి, ఆంథోనీ కారిగన్, నాథన్ ఫిలియన్, ఇసాబెలా మెర్సిడ్ తదితర ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హాలీవుడ్‌కు చెందిన క్రియేటివ్ మాస్టర్ జేమ్స్ గన్ (James Gunn) దర్శకత్వం వహించడంతో ఈ చిత్రంపై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. అతను గతంలో ‘సూసైడ్ స్క్వాడ్’, ‘గార్డియన్స్ ఆఫ్ ద గెలక్సీ’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే విడుదలైన టీజర్లు(Teasear), ట్రైలర్లు(Trailer) ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఉత్సాహం రేకెత్తించాయి. ట్రైలర్లు ఒకదానికొకటి భిన్నంగా ఉండి విజువల్స్‌, స్టన్నింగ్ విలన్ ప్రెజెంటేషన్‌, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ చిత్ర కథ తన వారసత్వాన్ని పునరుద్ధరించుకునే క్రమంలో ఒక యువ హీరో ప్రయాణంగా సాగుతుంది.

ఈ సినిమా తెలుగుతో పాటు భారతదేశంలోని ఇతర ప్రధాన భాషల్లోనూ డబ్బింగ్‌తో విడుదలవుతోంది. ఇప్పటికే అమెరికాలో ప్రివ్యూస్‌ జరిగి పాజిటివ్ రివ్యూస్ రావడంతో, ఈ చిత్రం కోసం గ్లోబల్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *