
సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth), డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో రూపొందిన పాన్-ఇండియా చిత్రం “కూలీ(Coolie)”. ఈరోజు (ఆగస్టు 14) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. నాగార్జున(Nagarjuna), అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్, సౌబీన్ షాహిర్, సత్యరాజ్ వంటి స్టార్ కాస్ట్‌తో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichadar)సంగీతం, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలిచిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఈ రివ్యూలో తెలుసుకుందాం..
కథ విషయానికొస్తే..
సైమన్ (Nagarajna) నడిపే అక్రమ దందాల చుట్టూ తిరుగుతుంది. రాజశేఖర్ (Satyaraj)ను దయాల్ (సౌబీన్ షాహిర్) చంపడంతో కథ మలుపు తిరుగుతుంది. రాజశేఖర్ స్నేహితుడైన దేవా (రజనీకాంత్) తన కుటుంబాన్ని కాపాడేందుకు రంగంలోకి దిగుతాడు. రజనీ-నాగార్జున మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్, క్లైమాక్స్‌లో అమీర్ ఖాన్, ఉపేంద్ర ఎంట్రీలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌తో సంబంధం లేని ఈ చిత్రం, రజనీ చరిష్మాతో ఆకట్టుకుంటుంది.
ఎవరెలా చేశారంటే..
రజనీకాంత్ పవర్‌ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్, నాగార్జున స్టైలిష్ విలనిజం అభిమానులను ఆకర్షించాయి. సౌబీన్ షాహిర్ పాత్ర సినిమాకు బలం అని, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందని చెప్పవచ్చు. యాక్షన్ సీక్వెన్స్‌లు, సినిమాటోగ్రఫీ ది బెస్ట్‌గా ఉన్నాయి. క్లైమాక్స్‌లో 20 నిమిషాలు థ్రిల్‌ను అందిస్తాయి. అయితే, కథ, స్క్రీన్‌ప్లే యావరేజ్‌గా ఉంది. సెకండాఫ్‌లో మూవీ కొంత నెమ్మదిగా సాగుతుంది.
రేటింగ్: 2.5/5