యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తున్నాడు హీరో సూర్య (Suriya). తన 46వ మూవీ కోసం ‘లక్కీ భాస్కర్’తో విజయాన్ని అందుకున్న వెంకీ అట్లూరి (Venky Atluri)తో జత కట్టాడు. వంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో సూర్య, వెంకీ అట్లూరి, ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.
హీరోయిన్గా మమితా బైజు
సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రేమలు మూవీతో ఆకట్టుకున్న మమితా బైజు (Mamitha Baiju) కథానాయిక. జీవీ ప్రకాశ్ మ్యూజిక్ అందించనున్నారు. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ తర్వాత వెంకీ అట్లూరి చిత్రానికి తాను వర్క్ చేయడంపై జీవీ ప్రకాశ్ స్పందించారు. ‘హ్యాట్రిక్’ కోసం వర్క్ చేయడం సంతోషంగా ఉందని చెప్పారు.
రెట్రో కలెక్షన్లపై ట్రోలింగ్
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య నటించిన రెట్రో (Retro) మూవీ ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. అయితే ఈ సినిమా కలెక్షన్ల మీద కొద్దిరోజులుగా ట్రోలింగ్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. సినిమా టాక్‌కి.. చిత్రబృందం ప్రకటిస్తున్న కలెక్షన్లకు సంబంధం లేదంటూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ మూవీకి ఏకంగా రూ.235 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని పోస్టర్ రిలీజ్ చేయడంతో మరోసారి ట్రోలింగ్ జరుగుతోంది.






