Mana Enadu : కోలీవుడ్ హీరో సూర్య (Suriya), డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ నుంచి తాజాగా అప్డేట్ వచ్చింది. పూజా హెగ్డే హీరోయిన్ గా సూర్య44 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకు ‘రెట్రో (RETRO)’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ క్రమంలోనే మేకర్స్ రెట్రో టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సూర్య ఊర మాస్ పాత్రలో నటించనున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. ప్రస్తుతం టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
మాస్ అవతార్ లో సూర్య
టీజర్ ఆరంభంలో హీరో సూర్య, హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) ఓ ఆలయం మెట్లపై కూర్చుని కనిపించారు. సూర్యకు పూజ ఓ తాయిత్తు కడుతుంది. ‘ఇది నా కోపాన్ని కంట్రోల్ చేస్తే.. నా తండ్రితో కలిసి పని చేయడం ఆపేస్తాను. హింస, రౌడీయిజం వంటి వాటి జోలికి పోను.’ అంటూ సూర్య ఓ ఇంటెన్స్ డైలాగ్ చెబుతాడు. మరి సూర్య ఎమోషన్స్‌ను ఆ తాయిత్తు కంట్రోల్ చేస్తుందా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
వచ్చే వేసవిలో రెట్రో రిలీజ్
అయితే టీజర్ (Suriya Retro Teaser) చివరలో మాత్రం సూర్య ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్ లో కనిపించడంతో ఈ మూవీలో సూర్య మాస్ అవతార్‌లో చూపించబోతున్నారని నెటిజన్లు భావిస్తున్నారు. ఇక ఈ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా.. సూర్య హోం బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్పై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో పాపులర్ మలయాళ నటుడు జోజు జార్జ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. వార్ అండ్ లవ్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.






