సూర్య ‘రెట్రో’ టీజర్ రిలీజ్.. శాంపిలే అదరగొట్టేశారు

Mana Enadu : కోలీవుడ్ హీరో సూర్య (Suriya), డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ నుంచి తాజాగా అప్డేట్ వచ్చింది. పూజా హెగ్డే హీరోయిన్ గా సూర్య44 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకు ‘రెట్రో (RETRO)’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ క్రమంలోనే మేకర్స్ రెట్రో టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సూర్య ఊర మాస్ పాత్రలో నటించనున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. ప్రస్తుతం టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మాస్ అవతార్ లో సూర్య

టీజర్ ఆరంభంలో హీరో సూర్య, హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) ఓ ఆలయం మెట్లపై కూర్చుని కనిపించారు. సూర్యకు పూజ ఓ తాయిత్తు కడుతుంది. ‘ఇది నా కోపాన్ని కంట్రోల్‌ చేస్తే.. నా తండ్రితో కలిసి పని చేయడం ఆపేస్తాను. హింస, రౌడీయిజం వంటి వాటి జోలికి పోను.’ అంటూ సూర్య ఓ ఇంటెన్స్ డైలాగ్ చెబుతాడు. మరి సూర్య ఎమోషన్స్‌ను ఆ తాయిత్తు కంట్రోల్‌ చేస్తుందా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

వచ్చే వేసవిలో రెట్రో రిలీజ్

అయితే టీజర్ (Suriya Retro Teaser) చివరలో మాత్రం సూర్య ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్ లో కనిపించడంతో ఈ మూవీలో సూర్య మాస్ అవతార్‌లో చూపించబోతున్నారని నెటిజన్లు భావిస్తున్నారు. ఇక ఈ మూవీకి సంతోష్‌ నారాయణన్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా.. సూర్య హోం బ్యానర్ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో పాపులర్ మలయాళ నటుడు జోజు జార్జ్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. వార్‌ అండ్ లవ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో వస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *