
ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (73) (Tabla maestro Zakir Hussain) అనారోగ్య సమస్యలతో అమెరికాలోని శాన్ ప్రాన్సిస్కోలో కన్నుమూశారు. రక్తపోటు సమస్యతో ఆదివారం ఉదయం యూఎస్ఏలోని శాన్ ప్రాన్సిస్కోలోని (San Francisco) ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. కాగా చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు.
తబలా మ్యాస్ట్రోగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు
జాకీర్ హుస్సేన్ 1951 మార్చి 9న ముంబయిలో జన్మించారు. ప్రముఖ తబలా వాయిద్యకారుడు అల్లారఖా పెద్ద కుమారుడే ఈ జాకీర్ హుస్సేన్. చిన్నప్పటి నుంచే తండ్రి బాటలో నడిచిని హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, (Hindustani Classical Music) జాజ్ ప్యూజన్లో నైపుణ్యం సాధించి తనదైన ముద్ర వేశాడు. 1990లో సంగీతానాటక అకాడమీ అవార్డు, 2009లో గ్రామీ పురస్కారం అందుకున్నారు. 1988 లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ తో ( Padma Vibhushan ) అవార్డులు అందుకున్నారు. జాకీర్ హుస్సేన్ భారత్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించాడు. తబలా మ్యాస్ట్రో గా మొత్తంగా ఐదు గ్రామీ అవార్డులు గెలుచుకున్న ఆయన.. ఈ ఏడాది ప్రారంభంలో 66వ గ్రామీ అవార్డుల్లో మూడింటిని కైవసం చేసుకున్నారు. ఆరు దశాబ్ధాల పాటు తబలా వాయించడంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా వావ్ తాజ్ అని చేసిన యాడ్ దేశంలోని ప్రతి వ్యక్తిని పలకరించే ఉంటుంది. ఉంగరాల జట్టుతో ప్రత్యేకంగా తబలా వాయిస్తూ ప్రజల మనసులు దోచుకున్నారు.
సంతాపం వ్యక్తం చేసిన సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు
ఆయన మృతికి పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జాకీర్ హుస్సేన్ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని అన్నారు. జాకీర్ హుస్సేన్ మరణం తనను షాక్ కు గురి చేసిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మాట్లాడుతూ.. భారతీయ సంగీత విద్వాంసుడు, శాస్త్రీయ సంగీతానికి మారుపేరు అని ట్విటర్ ఎక్స్ లో పోస్టు చేశాడు. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ మరణం పట్ల బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఆయన సంగీతం ఎప్పటికీ హృదయాల్లో ప్రతిధ్వనిస్తుంటుందని పేర్కొన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) జాకీర్ హుస్సేన్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.