Mana Enadu : టాలీవుడ్ లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు, సంధ్య థియేటర్ ఘటనపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaj) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన అల్లు అర్జున్ పై విమర్శలు గుప్పించారు. ఆయన చేసిన పనికి సీఎం రేవంత్ రెడ్డి ఎదుట తెలుగు సినిమా ఇండస్ట్రీ నిల్చోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.
“చిరంజీవి, బాలకృష్ణ (Balakrishna) వంటి స్టార్ హీరోలు కూడా ఒకానొక సమయంలో అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు వెళ్లేవారు. కానీ తగిన జాగ్రత్తలు పాటించేవారు. గతంలో హీరోలు సైలెంట్‌గా ఏదో ఒక మల్టీప్లెక్స్‌కు వెళ్లి సినిమా చూసి బయటకు వచ్చే సమయంలో అక్కడ ఉన్నవారితో కాసేపు మాట్లాడేవారు. సినిమా వాళ్లను ఫ్యాన్స్ దేవుళ్లుగా చూస్తారు. అందుకే హీరోలు ఎక్కడికి వెళ్లినా నాలుగు కారుల్లో వెళ్లి రోడ్ షో చేయాలని భావిస్తున్నారు. సైలెంట్‌గా వెళ్లి సినిమా చూసి వచ్చేస్తే ఇలాంటి ఘటనలు జరగడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది.
Suresh Babu & Tammareddy Bharadwaja fires on #AlluArjun
Chinna ledu peddha ledu andaru bhAAi @alluarjun ni anevalle
Andaru antondi okate direct ga involve aina indirect ga aina his mistake is absolutely there,because of his ego,self obsession while industry and family are… pic.twitter.com/R5wF4vXJYA
— Vamc Krishna (@lyf_a_zindagii) December 26, 2024
ఇప్పుడు సోషల్ మీడియా వల్ల హీరోలు ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారో తెలిసిపోతుండటంతో వాళ్లను చూసేందుకు అభిమానలు భారీ స్థాయిలో తరలివస్తున్నారు. ఫ్యాన్స్, ప్రజా శ్రేయస్సు గురించి కూడా హీరోలు ఆలోచించాలి. ఎక్కువ డబ్బు తీసుకుంటున్నామని హీరోలు అనిపించుకోవడం కోసం సినిమా టికెట్ రేట్లు (Ticket Price Hike) పెంచాల్సి వస్తోంది. టికెట్ రేట్లు పెంచి ప్రజల మీద ఆ భారం వేస్తున్నారు. కలెక్షన్స్ పరంగా కాదు పెర్ఫార్మెన్స్ పరంగా తెలుగువారికి గర్వకారణంగా నిలవాలి. మీరూ సాధారణ మనుషులమే అని అనుకుంటే ఇలాంటి హడావుడి ఉండదు.
ఒక్క మనిషి కోసం ఇండస్ట్రీ మొత్తం సీఎం దగ్గర తలవంచి నిలబడాల్సిన అవసరం ఏం వచ్చింది? ఆయన వల్లే ఇదంతా జరిగిందని నేను అనడం లేదు. కానీ ఈ ఘటనకు ఆయన బాధ్యుడయ్యారు. తప్పు జరిగిన తర్వాత దాన్ని మళ్లీ కవర్ చేయడానికి కొన్ని అబద్దాలు ఆడటం. దీనివల్ల ఇండస్ట్రీ పెద్దలంతా వెళ్లి అక్కడ కూర్చోవాల్సి వచ్చింది. ఒక మనిషి కోసం, ఒకరి ఈగో కోసం ఇంత మంది తలవంచాల్సి వచ్చింది. మీరూ సాధారణ మనుషులమే అని అనుకుంటే ఇలాంటి హడావుడి ఉండదు.” అని తమ్మారెడ్డి అల్లు అర్జున్ ఘటనపై ఫైర్ అయ్యారు.







