నాగ చైతన్య ‘తండేల్’ రిలీజ్ డేట్ అనౌన్స్

ManaEnadu:అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) హీరోగా తెరకెక్కుతోన్న ‘తండేల్‌’(Tandel) సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సాయిపల్లవి(Sai Pallavi) హీరోయిన్‌గా సందడి చేయనుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేందుకు మేకర్స్ ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టారు. 2025లో ఫిబ్రవరి 7న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. కాగా ఈ కార్యక్రమానికి హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయిపల్లవి, డైరెక్టర్ చందూ మొండేటీ, ప్రొడ్యూసర్లు అల్లు అరవింద్‌, బన్నీవాసు సైతం పాల్గొన్నారు.

‘అమరన్‌’ చూసి ఎమోషనల్‌ అయ్యానన్న అరవింద్
ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సాయి పల్లవి తనకు కుమార్తెతో సమానమన్నారు. ఇటీవల విడుదలైన ‘అమరన్‌’ చూసి ఎమోషనల్‌ అయ్యానని చెప్పుకొచ్చారు. సినిమా చూశాక సాయిపల్లవికి ఫోన్‌ చేసి స్పెషల్‌గా అభినందించినట్లు చెప్పారు. ఫిబ్రవరి 7నే ఎందుకంటే.. అది వాలెంటైన్స్ వీక్‌ ప్రారంభం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ మూవీతో అది నెరవేరింది: నాగచైతన్య
తన కెరీర్‌లో ఇప్పటి వరకు రిలీజ్‌ డేట్‌ను ముందుగా అనుకొని దాన్ని బట్టి సినిమా పూర్తిచేసేవాడినని నాగ చైతన్య అన్నారు. దాని వల్ల తప్పులు జరిగేవని చెప్పుకొచ్చారు. అందుకే సినిమా మొత్తం పూర్తయ్యాక రిలీజ్ డేట్‌ చెబితే బాగుండేదని అనుకునేవాడినన్న చైతూ ఈ మూవీ అది నెరవేరిందని తెలిపారు. ఈ మూవీలో శ్రీకాకుళంలో కొందరు మత్స్యకారుల జీవితం కనిపిస్తుందని, ఎప్పుడు రిలీజ్ చేసినా అది పండగే అవుతుందని చెప్పారు. ఇలాంటి మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉన్నామని తెలిపారు. ఈ సినిమా కోసం తాము శ్రీకాకుళం వెళ్లి మత్స్యకారులతో గడిపామని తెలిపారు. సాయి పల్లవితో డ్యాన్స్‌ చేయడం చాలా కష్టమని, ఆమె క్వీన్‌ ఆఫ్‌ బాక్సాఫీస్‌ అంటూ చైతూ ప్రశంసల వర్షం కురిపించారు.

‘తండేల్‌’ రియల్‌ లైఫ్‌ స్టోరీ: సాయి పల్లవి
‘తండేల్‌’ రియల్‌ లైఫ్‌ స్టోరీ అని హీరోయిన్ సాయి పల్లవి వెల్లడించారు. ఈ సినిమా కోసం టీమ్ అంతా ఎంతో కష్టపడిందని, నాగ చైతన్య సంవత్సరం నుంచి ఈ ప్రాజెక్ట్‌లోనే బిజీగా ఉన్నారని ఆమె తెలిపారు. ఆయన మరో ప్రాజెక్ట్‌ గురించి కూడా ఆలోచించలేదని వెల్లడించారు. ‘అమరన్‌’కు ఊహించని సక్సెస్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు ఆమె థాంక్స్ చెప్పారు. అల్లు అరవింద్‌ చెప్పినట్లు తనను ఆయన ఎప్పుడూ కుమార్తెగా భావిస్తారని సాయిపల్లవి తెలిపారు.

రూ.100కోట్ల క్లబ్‌లో చేరుతుంది: బన్ని వాసు
నాగచైతన్యకు తొలి రూ.100కోట్ల క్లబ్‌ మూవీ అందించబోతున్నట్లు నిర్మాత బన్ని వాసు ధీమా వ్యక్తం చేశారు. సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడలేదని, చాలా గొప్పగా తెరకెక్కించామని తెలిపారు. తొలుత ఈ మూవీని డిసెంబర్‌లో విడుదల చేయాలని భావించామని, షూటింగ్‌కు చాలా పర్మిషన్లు అవసరమయ్యాయని వివరించారు. అక్కినేని ఫ్యాన్స్ చూసి కాలర్‌ ఎగరేసేలా సినిమా ఉంటుందని హామీ ఇచ్చారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *