
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జూన్ 12న ఎయిరిండియా విమానం కుప్పకూలిన(Airindia Plane Crash) విషయం తెలిసిందే. ఈ పెను విషాదంలో మొత్తం 279 మంది మరణించారు. ఇప్పటికీ మరణించిన వారి ఆచూకీని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 204 మంది మృతదేహాలను గుర్తించారు. అందులో 160 డెడ్ బాడీస్‌ను వారి వారి కుటుంబాలకు అప్పగించారు. కాగా ఈ ఘోర విమాన ప్రమాదంపై తొలిసారిగా టాటాసన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్(Tata Sons Chairman N. Chandrasekaran) తాజాగా స్పందించారు. ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానం క్లీన్ హిస్టరీ(clean history)ని కలిగి ఉందని తెలిపారు. ఎయిరిండియా విమాన ప్రమాదం ఇంజిన్ వైఫల్యం(Engine failure) కారణంగానే సంభవించి ఉండవచ్చనే ఊహాగానాలను చంద్రశేఖరన్ కొట్టిపారేశారు.
ఎయిరిండియా విమానం క్లీన్ హిస్టరీని కలిగి ఉంది..
ఈమేరకు చాలా ఊహాగానాలు ఉన్నాయని ప్రస్తావించిన ఆయన ఇప్పటివరకు తనకు అందుబాటులో ఉన్న సమచారం ప్రకారం ప్రమాదానికి గురైన అహ్మదాబాద్-లండన్ AI-171 విమానం క్లీన్ హిస్టరీని కలిగి ఉందని చెప్పారు. ఈ విమానం రెండు ఇంజిన్లు(Two Engines) బాగానే ఉన్నాయని, 2025 మార్చిలో కుడివైపు కొత్త ఇంజిన్(Right Engine) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక ఎడమ ఇంజిన్(Left Engine) చివరిగా 2023లో సర్వీస్ చేశారని, దానిని తర్వాతి సర్వీస్(Service) ఈ ఏడాది డిసెంబర్లో జరగాల్సి ఉందని స్పష్టం చేశారు. విమానం, ఇంజిన్, పైలట్ రికార్డులను సమీక్షించానని కూడా ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. ఎటువంటి రెడ్ ఫ్లాగ్స్(Red flags) లేవని, తమ బృందం కూడా వాటిని గుర్తించలేదని తెలిపారు. అయితే ఈ ప్రమాదంపై అధికారిక దర్యాప్తు(Official investigation) పూర్తయ్యే వరకు తాను ఎటువంటి ప్రకటన చేయకూడదని ఆయన పేర్కొన్నారు.
Chairman of Tata Sons & Air India Exclusive
There are a lot of speculations — human error, aircraft issues, maintenance lapses. But the facts I know so far are: this particular aircraft, AI-171, has a clean history: N. Chandrasekaran, Chairman, Tata Sons & Air India, in… pic.twitter.com/KSe46icTZ2
— TIMES NOW (@TimesNow) June 19, 2025