ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కడప ఎయిర్ పోర్టులో జిల్లా నేతలు, అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కడప నుంచి హెలికాప్టర్ లో చంద్రబాబు మైదుకూరు చేరుకున్నారు. మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి (NTR Death Anniversary) కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎంగా నారా లోకేశ్
ఈ సందర్భంగా ఎన్టీఆర్ (NTR)కు ఘననివాళి అర్పించిన అనంతరం ఆయన ప్రసంగించారు. అయితే ఆయన సభా వేదికపై ఉన్న సమయంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి చంద్రబాబుకు ఓ ఆసక్తికర విజ్ఞప్తి చేశారు. ఏపీ డిప్యూటీ సీఎంగా నారా లోకేశ్ (Nara Lokesh)ను నియమించాలని శ్రీనివాస్ రెడ్డి చంద్రబాబును రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.







