Mana Enadu : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని (Telangana Assembly Meeting) ఈ నెల 30వ తేదీన నిర్వహించనుంది. సోమవారం ఉదయం 10 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. మూడోసభ రెండో సమావేశాల్లో భాగంగా 4వ సెషన్‌ను నిర్వహించాలని స్పీకర్ గడ్డం ప్రసాదకుమార్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సభను నిర్వహిస్తున్నట్టు అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
కేబినెట్ భేటీ వాయిదా
రేపటి సమావేశాల్లో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (Manmohan Singh)కు శాసనసభ నివాళి అర్పించనుంది. ఈ నేపథ్యంలో సోమవారం జరగాల్సిన రాష్ట్ర కేబినెట్ సమావేశం వాయిదా వేసినట్లు సచివాలయవర్గాలు తెలిపాయి. త్వరలోనే కేబినెట్ సమావేశం (Telangana Cabinet Meeting) షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని వెల్లడించాయి.







