Telangana Assembly: నేటి నుంచి అసెంబ్లీ వింటర్ సెషన్స్.. కేసీఆర్ వస్తారా?

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు(Telangana Assembly Winter Sessions) నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సోమవారం ఉదయం 10.30 గంటలకు శాసన సభ(Legislature), శాసన మండలి(Legislative Council) సమావేశాలు మొదలవుతాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి గవర్నర్ జిష్ణుదేవ్(Governor Jishnudev) నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈరోజు సభలో తెలంగాణ తల్లి విగ్రహ(Idol of Telangana Mother) ఆవిష్కరణపై CM రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. దీంతోపాటు సభలో ఏడు చట్ట సవరణ బిల్లులను పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

రెండు కొత్త బిల్లులను ప్రవేశపెట్టున్న ప్రభుత్వం?

ఇదిలా ఉండగా ఈ సమావేశాల్లో మరో రెండు కొత్త బిల్లుల(New Bills)ను ప్రవేశపెట్టనున్నారు. పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లు, రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌(RoR) బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. గతంలో ఇద్దరు వరకు సంతానం ఉన్న వారికి మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో(In local body elections) పోటీ చేసే అవకాశం ఉండేది. అయితే ప్రభుత్వం దీనిని సవరించి ముగ్గురి సంతానం ఉన్నా పోటీ చేసే అవకాశం కల్పించబోతోంది.మరోవైపు పంచాయతీ ఎన్నికల(Panchayat Elections)పై కూడా గవర్నమెంట్ కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. త్వరలో సర్పంచ్ ఎలక్షన్స్(Sarpanch Elections) నిర్వహించాలని భావిస్తోందట.

కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైనప్పటినుంచి..

మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశా(In assembly meetings)ల్లో ఒక్కసారి మాత్రమే అది కూడా ఒక్క రోజు మాత్రమే ప్రతిపక్షనేత KCR సభకు హాజరయ్యారు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ ఆ రోజు సమావేశం ముగియక ముందే వెళ్లిపోయారు. ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు KCR హాజరవుతారా.. లేదా.. అనేది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ప్రభుత్వ పెద్దల నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందనేది మరింత ఆసక్తికరంగా మారింది.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *