
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన ఈ రోజు (ఆగస్టు 4) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ క్యాబినెట్ సమావేశం(Telangana Cabinet meeting) జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా, కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో జరిగిన అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghosh Commission) సమర్పించిన నివేదికపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నివేదికలోని సిఫార్సుల ఆధారంగా తదుపరి చర్యలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. అలాగే, రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల(BC Reservations)కు సంబంధించిన ఆర్డినెన్స్ ముసాయిదా, రైతుల సమస్యలు, స్థానిక ఎన్నికలు, సీతారామ ప్రాజెక్టు, దేవాదుల ఎత్తిపోతల పథకం వంటి అంశాలపై కూడా చర్చ జరిగే సూచనలు ఉన్నాయి.
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు
వీటితోపాటు సిగాచి అగ్నిప్రమాదం(Sigachi fire Incident)పై నివేదికను కూడా సమీక్షించనున్నారు. రైతు భరోసా పథకం(Rythu Bharosa), మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ వంటి అభివృద్ధి ప్రాజెక్టులపై కూడా నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది. సీఎం రేవంత్ ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ భేటీ తెలంగాణ రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశముంది.
Telangana Cabinet to deliberate on Justice PC Ghose Commission report on Kaleshwaram project irregularitieshttps://t.co/s5dUFUzVE1
— South First (@TheSouthfirst) August 3, 2025