
దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) మృతి దేశానికి తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సభ ప్రారంభం కాగానే సభ్యులంతా జాతీయగీతం ఆలపించారు. అనంతరం మన్మోహన్ సింగ్ మృతిపై సంతాప తీర్మానాన్ని(Resolution of condolence) సీఎం సభలో ప్రవేశపెట్టారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపుతున్నట్లు ప్రకటించారు. దేశ ప్రధానిగా మనోహ్మన్ చేసిన సేవలు మరువలేనిమన్నారు. అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందిన ఆయన భారతదేశానికి విశిష్ట సేవలు అందించారని సీఎం కొనియాడారు.
ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేశారు: సీఎం
PMగా, ఆర్థిక సలహాదారుగా, RBI గవర్నర్‌గా అనేక సంస్కరణలను అమలు చేశారని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో భారత ఆర్థిక వ్యవస్థ(Economic system)ను సుస్థిరం చేశారని అన్నారు. కూలీలకు ఉపాధి అందించే ఉపాధి హామీ పథకానికి రూపకర్త అని కొనియాడారు. ఆర్థికవేత్తగా, సంస్కరణల సారథిగా మన్మోహన్ సింగ్‌ను దేశం గుర్తుంచుకుంటుందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పీఎంగా మన్మోహన్ చూపిన చొరవ అమోఘమని అన్నారు. దేశానికి విశిష్ట సేవలు ఏర్పాటు చేసిన ఆయనకు ‘భారత రత్న’ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే తెలంగాణలోనూ ఆయన స్మారక స్తూపం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు.
బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు: కేటీఆర్
మనోహ్మన్ ప్రధాని పేరు చెబితేనే దేశంలో ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు గుర్తుకు వస్తాయని, దేశానికి ఆయన అందించిన సేవల వల్లే భారతరత్నకు అర్హుడని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇక మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాకికి BRS సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ నేత KTR ప్రకటించారు. అలాగే ఆయనకు భారత రత్న ఇవ్వాలన్న సీఎం రేవంత్ ప్రతిపాదనకు కూడా మద్దతిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. అనవసరపు ఆర్భాటాలు లేకుండా, సింపుల్‌గా తన పని చేసిన మహానుభావుడు మన్మోహన్ సింగ్ అని కేటీఆర్ కొనియాడు.
Revanth Reddy Pays Tribute to Manmohan Singh in Telangana Assembly
తెలంగాణకు మన్మోహన్ సింగ్ ఆత్మబంధువు
శాసన సభలో మాజీ ప్రధాని మన్మోహన్కు నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి#ManmohanSingh #RevanthReddy
• @revanth_anumula pic.twitter.com/7q9asutGM2— Congress for Telangana (@Congress4TS) December 30, 2024