మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

మన ఈనాడు: నల్గొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ పై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని లారీ కారును ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడిక్కడే ప్రాణలొదిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడడంతో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యచికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మిర్యాలగూడ మండలం నందిపాడు గ్రామానికి చెందిన మహేష్ (35), జ్యోతి (30), మచ్చేందర్ (38), ఇషిక(8), లియాన్స్ (2)గా గుర్తించారు. విజయవాడలో కనుకదుర్గమ్మ దర్శించుకొని ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Related Posts

మీర్‌పేట మర్డర్ కేసు.. ఆ గొడవే హత్యకు కారణం!

రంగారెడ్డి జిల్లా మీర్ పేట హత్య కేసు(Meerpet Woman Murder Case)లో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు. ఈ నెల 15వ తేదీన భార్య వెంకటమాధవిని హత్య చేసిన…

ఇంతకు తెగించావా గురుమూర్తి?.. మీర్‌పేట హత్య కేసులో సంచలన ట్విస్ట్

హైదరాబాద్‌ మీర్‌పేటలో గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యను కిరాతకంగా హత్య (Meerpet Murder Case) చేసి, ముక్కలుగా నరికిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న అతను పక్కా ప్లాన్ ప్రకారమే భార్యను హతమార్చినట్లు తెలిసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *