తెలంగాణ ఎంసెట్ (TG EAPCET 2025) కౌన్సెలింగ్ ప్రక్రియ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, అండ్ ఫార్మసీ కోర్సులలో అడ్మిషన్ల ప్రక్రియ నేటి నుంచి మొదలుకానుంది. ఈ మేరకు తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TGCHE) ఈ ప్రక్రియను నిర్వహించనుంది. 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం, రిజిస్ట్రేషన్ జూన్ 28 నుంచి జులై 7 వరకు జరుగుతుంది. అర్హత పొందిన అభ్యర్థులు tgeapcet.nic.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. అభ్యర్థులు TG EAPCET 2025లో క్వాలిఫై అయి ఉండాలి. తెలంగాణ/ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక స్థితిని కలిగి ఉండాలి. కౌన్సెలింగ్ రుసుము జనరల్ విభాగానికి రూ.1200, SC/ST విభాగానికి రూ.600. చెల్లించాలి. ర్యాంకు(Rank) ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. రిజర్వేషన్ విధానాలు వర్తిస్తాయి.
కౌన్సెలింగ్ ప్రక్రియలో నాలుగు ప్రధాన దశలు
రిజిస్ట్రేషన్(Registration), ధ్రువపత్రాల పరిశీలన(verification of certificates), వెబ్ ఆప్షన్ల(Web Options) ఎంట్రీతోపాటు సీటు కేటాయింపు. రిజిస్ట్రేషన్ తర్వాత, జులై 5 నుంచి 13 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. అభ్యర్థులు తమ విద్యా ధ్రువపత్రాలు, కుల ధ్రువీకరణ, ఇతర అవసరమైన పత్రాలను సమర్పించాలి. జులై 8 నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్ల ఎంట్రీ ఉంటుంది, ఇక్కడ అభ్యర్థులు తమకు ఇష్టమైన కాలేజీలు, కోర్సులను ఎంచుకోవచ్చు. మొదటి విడత సీటు కేటాయింపు జులై 18న ప్రకటిస్తారు.

రెండు, మూడో విడత కౌన్సెలింగ్ ఈ తేదీల్లోనే
రెండో విడతన(Second Phase) రిజిస్ట్రేషన్ జులై 25న ప్రారంభవుతుంది. జులై 26న సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 26,27న వెబ్ ఆప్షన్లు, 30న సీట్ల కేటాయింపు, 30, ఆగస్టు 1న ఫీజు చెల్లింపు, జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక మూడో విడత(Third Phase)న రిజిస్ట్రేషన్ ఆగస్టు 5న ప్రారంభవుతుంది. ఆగస్టు 6న సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఆగస్టు 6, 7న వెబ్ ఆప్షన్లు, 10న సీట్ల కేటాయింపు, 10 నుంచి 12న ఫీజు చెల్లింపు, ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.








