దేవరకొండ ‘బాలు’దే పవర్​.. కారుకు ఫీవర్​

మన ఈనాడు:
జనంతో ఉంటూ..ఆపదలో అండగా నిలబడిన నాయకుడికే వైపే ప్రజలు మొగ్గు చూపుతారు. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా..ప్రజలకు అందుబాటులో ఉండటంలో వెనకడుగు వేయలేదు..అందుకే అభివృద్ధి మంత్రం జపిస్తున్న కారుకు ఆ నేతను చూసి ఫీవర్​ పట్టుకుంది. దేవరకొండ నియోజకవర్గంలో ‘హస్తం’ అభ్యర్థి బాలు నాయక్​ గెలుపించుకునేందుకు ప్రజలే సిద్దం అయ్యారు.

తెలంగాణ సెంటిమెంట్​ అధికారం పగ్గాలు చేపట్టిన గులాబీ ఎమ్మెల్యే రవీంద్రనాయక్​పై సొంతపార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్నారు. సంక్షేమ పథకాలు జపంతో నియోజకవర్గంలో ప్రచారం చేస్తుంటే ప్రజలే వెనక్కి పంపిస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి.

కాంగ్రెస్​ పార్టీ బలంగా ఉన్న దేవరకొండలో చింతపల్లి, చందంపేట, గుండ్లపల్లి, పెద్ద అడిసెర్లపల్లి, నెరేడుగొమ్ము,కొండమల్లేపల్లి, దేవరకొండ మండలాల్లో హస్తం పార్టీ బలంతోపాటు బాలునాయక్​ ఉన్న వ్యక్తిగత సంబంధాలు నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా ఓటు కాంగ్రెస్​ బదిలీ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

రేవంత్​రెడ్డితోపాటు కొమటిరెడ్డి సోదరులు బలంతో ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్​ జోష్​లో ఉంది. కార్యకర్తలు స్వచ్చంధంగా వచ్చి కాంగ్రెస్​ అభ్యర్థుల ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థులు గెలుపుకోసం తమదైన శైలిలో పనిచేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే రాహుల్​ ప్రకటించిన ఆరు గ్యారంటీల బలం..ప్రజల సంక్షేమం అనే నినాదంతో ప్రజలకు భరోసాను సైతం నింపుతున్నారు. ఈసారి అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్​..ప్రజలకు అందేది సుపరిపాలన అంటున్నారు. నవంబర్​ 30న ప్రజలు పెద్ద ఎత్తున పొలింగ్​ కేంద్రాలకు తరలి వచ్చి తిరుగులేని తీర్పు ఇవ్వబోతున్నారని కాంగ్రెస్​ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Popular