నేడు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం(Telangana Formation Day). 7 దశాబ్దాల కల నెరవేరిన రోజు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటితో 11 వసంతాలు పూర్తయి.. 12వ పడిలోకి చేరుకుంది. మలిదశ ఉద్యమం(Malidasha Movement)లో తెలంగాణ ప్రాంత ప్రజలు సకలజనులు కలిసి స్వరాష్ట్రం సాధించుకున్న రోజే జూన్ 2. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వెనుక దాదాపు 7 దశాబ్దాల చరిత్ర ఉంది. తొలిదశ ఉద్యమం 1969లో ప్రారంభమై రక్తసిక్తం అయింది. ఈ తొలి దశ ఉద్యమంలో సుమారు 350కు పైగా యువకులు పోలీసుల కాల్పుల్లో అమరులయ్యారు. ఆ తర్వాత 2001లో తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రజల్లో ఉవ్వెత్తున ఎగసింది. దాదాపు 1200 మంది అసువులుబాశారు. స్వరాష్ట్ర సాధన కోసం కవులు, రచయితలు, విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు, ప్రజలతో పాటు రాజకీయ పార్టీల పెద్దలు కీలక పాత్ర పోషించారు. దీంతో జూన్ 2, 2014న ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ(Telangana as a separate state) పురుడుపోసుకుంది.
నా తెలంగాణ కోటి రతనాల వీణ
తెలంగాణ ప్రజలందరికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
జై తెలంగాణ ✊
తెలంగాణ అమరవీరులకు జోహార్లు#TelanganaFormationDay #Telangana pic.twitter.com/dXkCknPtkt
— Deva Reddy (@deva_reddy45) June 1, 2025
నేడు పలు సంక్షేమ పథకాల ప్రారంభం
ఈ సందర్భంగా స్వరాష్ట్ర సాధన కోసం.. తాము కలలు కన్న రాష్ట్రం కోసం ఎంతో మంది పోరాటం చేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కాగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాల(Welfare schemes)ను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం, రైతు భరోసా నిధుల(Rythu Bharosa) విడుదల, ఉద్యోగులకు DA ప్రకటన వంటి ముఖ్యమైన కార్యక్రమాలు జూన్ 2 నుంచి అమల్లోకి రానున్నాయి. అంతేకాకుండా, అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు భూ సమస్యలపై ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నారు.
జాతీయ జెండా ఆవిష్కరించనున్న సీఎం రేవంత్
ఇక పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలను కాంగ్రెస్ సర్కార్ ఘనంగా నిర్వహిస్తోంది. ముందుగా సీఎం రేవంత్(CM Revanth) జాతీయ గీతాలాపనతో వేడుకలు ప్రారంభమవుతాయి. తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతాలాపన, పోలీసుల గౌరవ వందనం, పరేడ్ ఉంటాయి. అనంతరం CM ప్రసంగిస్తారు. పలు రంగాల్లో విశేష సేవలు అందించినవారికి పతకాలను అందిస్తారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవులు, కళాకారులు, ఇతర ప్రముఖులను సత్కరిస్తారు. ఈ సందర్భంగా పోలీసులు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Restrictions) విధించారు.
మన ప్రతీ ఊపిరి ఉద్యమమే. ప్రతీ అడుగు ప్రగతి వైపే.
తెలంగాణ ప్రజానికానికి 11వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.@TGMeeTicket @TGTwallet#telanganaformationday #meesevathomeepanulueasy
#governmentoftelangana
#2ndjune #formationday pic.twitter.com/LkgzDZRUQg— Mee Seva (@TGMeeSeva) June 1, 2025






