మన ఈనాడు:తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వేను మరో సారి నిర్వహించాలని రేవంత్‌రెడ్డి సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. 6గ్యారెంటీల అమలు కోసం ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించబోతున్నారు. ఈసమయంలోనే సర్వేను నిర్వహించి వివరాలు సేకరించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
ఈ సర్వే ద్వారా ఒక్కో కుటుంబం వివరాలను ప్రభుత్వం సేకరించనుంది. ప్రతీ కుటుంబానికి ఉన్న భూములు, ఇళ్లు, ఉద్యోగం, వ్యాపారం, ఆదాయం, వాహనాలు, గ్యాస్ కనెక్షన్లు తదితర వివరాలతో పాటు రేషన్ కార్డు వివరాలను అధికారులు సేకరించనున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. 2014 ఆగస్టు 19న ఒకేరోజు సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించింది. అయితే.. ఆ సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించలేదు.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…