తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ ఫిలీం అవార్డుల(Gaddar Film Awards) ప్రదానోత్సవం ఈరోజు (జూన్ 14)న జరగనుంది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరగనుంది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం నుంచి తెలుగు సినిమా అవార్డుల కార్యక్రమం జరగకపోవడంతో.. ఈ కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించేందుకు తెలంగాణ ఫిలీం డెవలప్‌మెంట్ కార్పొరేషన్(TFDC) ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 2014 నుంచి 2023 వరకూ ఉత్తమ చిత్రాలకు..2024 సంవత్సరానికి అన్ని విభాగాలకూ గద్దర్ ఫిల్మ్ అవార్డులను అందజేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులు, సినీ ప్రముఖులు పాల్గొననున్నారు.

ఏ అవార్డుకు ఎంత ఇస్తారంటే?
కాగా ఈరోజు 2014 నుంచి 2024 వరకూ ప్రకటించిన అన్ని ఉత్తమ సినిమాల(Best Movies)తోపాటు బెస్ట్ హీరో(Best Actor), హీరోయిన్, డైరెక్టర్(Director) తదితర అవార్డులను ప్రదానం చేస్తారు. ఇందులో ఆరు ప్రత్యేక అవార్డులకు ఒక్కో దానికి పురస్కారంతోపాటు రూ.10 లక్షలు ఇస్తారు. అలాగే ఉత్తమ తొలి చిత్రానికి రూ.10 లక్షలు, రెండో చిత్రానికి రూ.7లక్షలు, మూడో చిత్రానికి రూ.5లక్షలు ఇస్తారు. అలాగే ఉత్తమ నటుడు, నటికి రూ. 5లక్షల చొప్పున అందజేస్తారు. కాగా 14 ఏళ్ల తర్వాత సినిమా నటీనటులను, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ గద్దర్ అవార్డులను ప్రవేశపెట్టింది.







