మెట్రో రయ్ రయ్.. రెండో దశ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు

Mana Enadu : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. ఇక నగరమంతా మెట్రో రయ్ రయ్ మని పరుగులు పెట్టనుంది. తాజాగా మెట్రో రైలు (Hyderabad Metro Rail) రెండో దశ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. రెండో దశలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం జీవో 196ని జారీ చేసింది.

రెండో దశలో 60కి పైగా మెట్రో స్టేషన్లు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రెండో దశ ప్రాజెక్టు (Hyderabad Metro Second Phase) నిర్మాణాన్ని చేపట్టనుండగా.. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.24,269 కోట్లు ఖర్చు చేయనుంది. ఇక రెండో దశకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్ రెడీ అయిన విషయం తెలిసిందే. రెండో దశలో నగరవ్యాప్తంగా 60కి పైగా స్టేషన్లు రానున్నాయి. మొదటి దశలోని మూడు కారిడార్లకు కొనసాగింపుగా రెండో దశలో ప్రతిపాదించిన మార్గాలు రానున్నాయి.

కారిడార్-3కి కొనసాగింపుగా నాగోల్ నుంచి ఎల్బీనగర్, మైలార్​దేవుపల్లి, జల్​పల్లి, శంషాబాద్ విమానాశ్రయం (Shamashabad Airport) వరకు 33.1 కిలోమీటర్లు పొడిగించనుండగా..  ఈ మార్గంలో 22 స్టేషన్లు రానున్నాయి. ఈ కారిడార్ కు మరోవైపు రాయదుర్గం నుంచి కాజాగూడ, నానక్​రాంగూడ, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, యూఎస్ కాన్సులేట్ మీదుగా కోకాపేట నియో పోలీసు వరకు 11.3 కిలోమీటర్లు విస్తరిస్తారు. 

కారిడార్-1కి కొనసాగింపుగా ఎల్బీనగర్ (LB Nagar) నుంచి హయత్​నగర్ (Hayatnagar) వరకు 8 కిలోమీటర్లు.. ఇదే కారిడార్ కు రెండోవైపు పొడిగింపుగా మియాపూర్ నుంచి పటాన్​చెరు వరకు 14 కిలోమీటర్లు పొడిగించనున్నారు. కారిడార్-2లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్​నుమా, చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ. పొడిగిస్తారు. ఆరు స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి.

Share post:

లేటెస్ట్