
Mana Enadu : కొత్త రేషన్ కార్డుల (Ration Cards) జారీపై రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి తర్వాత కొత్త కార్డులు అందజేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఇప్పుడిచ్చే ఆరు కిలోలతో పాటు సన్న బియ్యం అందజేస్తామని వెల్లడించారు. కొత్త రేషన్ కార్డులకు రూ.956 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు.
కొత్తగా 36 లక్షల మందికి రేషన్ కార్డులు (New Ration Cards) ఇవ్వాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ సబ్ కమిటీ వేశామని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వీటిపై రేషన్ కార్డుల జారీపై కేబినెట్ భేటీలో చర్చిస్తామని వెల్లడించారు. రేషన్ కార్డుల జారీలో పాత పద్ధతి కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్డుల్లో ఎలక్ట్రానిక్ చిప్ లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.