Telangana: తెలంగాణకు రెడ్ అలెర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

మన ఈనాడు:మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా తెలంగాణకు కూడా భారీ వర్ష సూచన చేసింది భారత వాతావరణ శాఖ. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు స్థానిక ప్రభుత్వాలకు సూచించింది

మిచౌంగ్‌ తుఫాను కారణంగా డిసెంబర్ 5న తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ప్రకటించింది. మంగళవారం రాష్ట్రంలో 204.4 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. రెడ్ అలర్ట్ జారీ చేయడంతో, ప్రజలు అప్రమత్తంగా, సురక్షితంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం, మైచాంగ్ తుఫాను తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశాలోని పలు ప్రాంతాల్లో విపరీతమైన ప్రభావం చూపుతుంది.

ఏపీ సర్కార్ అలెర్ట్….
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం చెన్నైతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మరో 24 గంటలపాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు మిచౌంగ్ తుఫాను నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరం దాటవచ్చన్న సమాచారంతో సీఎం జగన్ కలెక్టర్లతో సమీక్ష జరిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి జిల్లాకు సీనియర్‌ అధికారుల నియమించారు. ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్‌.

ఇటు తుపాను ప్రభావంతో అవనిగడ్డ నియోజకవర్గం వ్యాప్తంగా ఆరు మండలాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. తుఫాన్ ప్రభావంతో హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో ఎగిసిపడుతున్న అలలు ఎగసిపడుతున్నాయి. సుమారు మీటర్ల ఎత్తున అలలు ఎగిసి పడుతున్నాయి. మిచౌంగ్ తుఫాను పరిస్థితులను పర్యవేక్షించేందుకు అధికారులు నాగాయలంక, కోడూరు మండలాలకు చేరుకున్నారు. అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వేటకు వెళ్ళిన మత్స్యకారులను వెనక్కి పిలిపిస్తున్నారు. తుఫాను దృష్ట్యా పాఠశాలలకు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. తుఫాన్ నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు రెడ్‌ అలర్ట్ ప్రకటించారు. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అల్లూరి సీతారామరాజు, విశాఖ, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

Related Posts

California Wildfire: తగలబడుతోన్న కాలిఫోర్నియా.. USలో కార్చిచ్చు విలయం

అగ్రరాజ్యం అమెరికా(America)ను అగ్ని(Wild Fire) దహించివేస్తోంది. పేరుకు పెద్దన్నగా చెప్పుకునే ఆ దేశాధినేతలు సైతం కార్చిచ్చును కంట్రోల్ చేయలేకపోతున్నారు. 8 రోజుల క్రితం లాస్ ఏంజెలిస్‌(Los Angeles)లో మొదలైన ఈ కార్చిచ్చు ఇప్పుడు కాలిఫోర్నియా(California)కు ఎగబాకింది. దీంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు.…

ట్రంప్.. నీ తీరు మారదా?

Mana Enadu:అగ్రరాజ్యంలో ఎన్నికల వేడి క్రమంగా హీటెక్కుతోంది. రిపబ్లికన్ పార్టీ తరఫున రెండోసారి అమెరికా అధ్యక్ష రేసులో నిలిచిన ట్రంప్ తన పదునైన ప్రసంగాలతో దూసుకుపోతున్నారు. ఇదే ఊపులో మరోసారి అధ్యక్ష రేసులో నివాలనుకున్న ప్రస్తుత అధ్యక్షుడు జొబైడెన్‌ను ఏకంగా పోటీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *