
తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాల(Inter Advanced Supplementary Results) కోసం ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న విద్యార్థులకు అలర్ట్ వచ్చేసింది. ఈ మేరకు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్‌తోపాటు ఇంప్రూవ్ మెంట్ ఫలితాలు(Improvement results) ఈ రోజు (జూన్ 16) వెలువడనున్నాయి. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను రిలీజ్ చేయనున్నట్లు రాష్ట్ర ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య(Inter Board Secretary Krishna Aditya) తెలిపారు. కాగా ఈసారి ఏకంగా 4.2 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్ధులు హాజరుకావడంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇంటర్ పరీక్షల్లో తప్పిన కొందరు విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరైతే.. మరికొందరేమో మార్కులను పెంచుకునేందుకు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాశారు. కాగా విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://tgbie.cgg.gov.in/లో ఫలితాలు తెలుసుకోవచ్చు.
పరీక్షలు రాసిన 4.2 లక్షల మంది విద్యార్థులు
కాగా తెలంగాణ(Telangana) వ్యాప్తంగా ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు(Supplementary Exams) మే 22 నుంచి మే 29 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 4.2లక్షల విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 892 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు నిర్వహించారు. మే 29 నుంచి మొదటి విడత మూల్యాంకనం, మే 31 నుంచి రెండో విడత మూల్యాంకనం చేపట్టారు. ఎంసెట్, నీట్ వంటి ప్రవేశాలకు ఇంటర్ మార్కులు కీలకం కానున్నాయి.
🚨 🚨 #BreakingNews TS Inter Supplementary Result 2025 Date: Check latest update, how to download the result from https://t.co/zs3z5oXGqN https://t.co/7M3LHXrW7t
The Telangana Board of Intermediate Education (TSBIE) is yet to announce the TS Inter Supplementary Result 2025 fo…
— Instant News ™ (@InstaBharat) June 4, 2025