మన ఈనాడు: ఐఆర్సీటీసీతత్కాల్ టికెట్ బుకింగ్ అంత ఈజీ కాదు.. ఏ కొంచెం తేడా వచ్చినా టికెట్ దొరకదు. ఇంటర్నెట్ స్పీడ్ స్లో తదితర సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇవీ ప్రయాణికులకు చిరాకు తెప్పిస్తాయి.
ఐఆర్సీటీసీ తత్కాల్ టికెట్ బుకింగ్ అంత ఈజీ కాదు.. ఏ కొంచెం తేడా వచ్చినా టికెట్ దొరకదు. ఇంటర్నెట్ స్పీడ్ స్లో తదితర సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇవీ ప్రయాణికులకు చిరాకు తెప్పిస్తాయి. ఈ పండుగ సమయంలో ప్రయాణికులు చిన్నపాటి ట్రిక్ ఫాలో అయితే టికెట్ దొరుకుతుంది. ఆటోమేషన్ టూల్‌తో ప్రయాణం కన్ఫామ్ అవుతుంది. జర్నీ హ్యాపీ అవుతుంది.
ఇలా చేయండి..
క్రోమ్ బ్రౌజర్‌లో ఐఆర్సీటీసీ తత్కాల్ ఆటోమేషన్ టూల్‌ను డౌన్‌లోడ్ చేయండి.
ఐఆర్సీటీసీ ఖాతాను లాగిన్ చేయండి. మీకు అది లేకుంటే సాధారణ ప్రక్రియను ఫాలో అయ్యి ఒక ఖాతాను తెరవండి.
మీరు మీ తత్కాల్ బుకింగ్ ప్రారంభించే ముందు, ప్రయాణ తేదీలు, చెల్లింపుల ప్రాధాన్యతలు (మొబైల్ బ్యాంకింగ్, కార్డ్ చెల్లింపు, యూపీఐ లేదా మరిన్ని) వంటి వివరాలను సేవ్ చేయడానికి ఈ టూల్ ఉపయోగపడుతుంది.
బుకింగ్ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు ‘డాటాను లోడ్ చేయి’పై క్లిక్ చేయండి.
సమాచారం సెకన్లలో లోడ్ అవుతుంది.
వెంటనే చెల్లింపులు కొనసాగండి.
పూర్తి చేసిన తర్వాత, మీ తత్కాల్ టికెట్ బుక్ అవుతుంది. ఇంటర్నెట్ స్పీడ్ నెమ్మదించడం గురించి చింతించకుండా కన్ఫర్మ్‌డ్ తత్కాల్ టికెట్‌ను పొందడానికి ఈ ట్రిక్ సహాయం చేస్తుంది.