MMTS: రద్దీ ఉన్నా..రైళ్లు పెంచట్లే..కారణం అందుకేనట..

ఒకప్పుడు 1.20 లక్షల మంది ప్రయాణికులున్న ఎంఎంటీఎస్‌(MMTS) ఇప్పుడు 40 వేలకే పరిమితమైంది. గతంలో 45 కిలోమీటర్లు 120 సర్వీసులు ఉన్నాయి. రెండోదశ అందుబాటులోకి వచ్చాక 145 కిలోమీటర్ల మేర పెరిగింది. కానీ కేవలం వందలోపు సర్వీసులతో సరిపెడుతున్నారు. రద్దీ లేని సమయాల్లో 12 బోగీలకు బదులు 9 బోగీలతో నడిపి సర్వీసులు పెంచితే బాగుంటుందని ప్రయాణికులు విన్నవించినా రైల్వే అధికారులకు పట్టడంలేదు.

Hyderabad MMTS:ఎంఎంటీఎస్‌ స్టేషన్లలో రైళ్ల రాకపోకల సమయాల పట్టిక ఉంచేవారు. కానీ ప్రయాణికులకు టైమ్​ టేబుల్​ అందుబాటులో లేకుండా చేశారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 7.30 వరకు ఒక్క ఎంఎంటీఎస్‌ కూడా రావడం లేదు. రాత్రి 7.45 గంటలకు ఒక రైలు మాత్రమే వచ్చింది.

Local Trains:లోకల్‌ రైళ్లకు మొదటి ప్రాధాన్యమివ్వాలని రైల్వే బోర్డు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయి. మన నగరంలో గతంలో అరగంటకో రైలొస్తే ఇప్పుడు రెండు గంటలకో రైలు వస్తోంది. దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లకు, గూడ్స్‌ రైళ్లకు ప్రాధాన్యమిచ్చి ఎంఎంటీఎస్‌లను ఆపేయడమే ప్రధాన కారణమని ఎంఎంటీఎస్‌ ప్రయాణికుల సంఘ అధ్యక్షుడు చందు, సబర్బన్‌ ప్రయాణికుల సంఘ ప్రధాన కార్యదర్శి నూర్‌మహ్మద్‌ ఆరోపిస్తున్నారు. లింగంపల్లి – ఘట్‌కేసర్‌కు ఎంఎంటీఎస్‌ల డిమాండ్లున్నా కేవలం రెండు సర్వీసులే నడపడాన్ని తప్పుపడుతున్నారు. మేడ్చల్‌ – సికింద్రాబాద్‌ మధ్య కూడా కేవలం 10 సర్వీసులుండటమేంటని ప్రశ్నిస్తున్నారు.

Share post:

లేటెస్ట్