TS Inter Results 2024 : నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు..

Telangana Inter Results Today : నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు రిలీజ్ అవ్వనున్నాయి. ఉదయం 11 గంటలకు ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం.. ఇంటర్ విద్యామండలి కార్యాలయంలో ఫలితాలను వెల్లడించనున్నారు. 2023-24 విద్యాసంవత్సరంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19వ తేదీ వరకూ ఇంటర్ పరీక్షలు నిర్వహించగా.. 9 లక్షల 80 వేల 978 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 4 లక్షల 78 వేల 527 మంది ఫస్టియర్ పరీక్షలు రాయగా.. 4 లక్షల 43 వేల 993 మంది సెకండియర్ పరీక్షలు రాశారు.

ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఏకకాలంలోనే విడుదల చేయనున్నారు. ఈ మేరకు అంతా సిద్ధం చేశారు అధికారులు. ఫలితాలు విడుదలయ్యాక విద్యార్థులు తమ రిజల్ట్ ను http://www.manabadi.co.in/ వెబ్ సైట్ లో లేదా.. https://tsbie.cgg.gov.in/, https://results.cgg.gov.in/ వెబ్ సైట్లలోనూ చెక్ చేసుకోవచ్చు.

Share post:

లేటెస్ట్